ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైతే ఏడాదికి రూ.12 వేలు

ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేక ఎందరో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పథకం ద్వారా ఉపకార వేతనాలను అంది స్తూ భవిష్యత్తు చదువును ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తుంది. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం సాయపడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2008లో ప్రారంభించి ప్రతి ఎటా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్త్తుంది. ప్రస్తుతం 2019-2020 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్‌ ఇటీవల విడుదలైంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు నాలుగేండ్ల పాటు ఏడాదికి రూ.12 వేల రూపాయల చోప్పున ఉపకార వేతనం అందుతుంది


గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ విద్యలో ముందుండే విద్యార్థులు బడి మానేయకుండా ఉన్నత చదువు చదివేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని రూ పొందించింది. అర్హత పరీక్ష వలన గ్రామీణ ప్రాంతాల్లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల మధ్య పోటీతత్వం పెరిగి ఉన్నత విద్యాప్రమాణాలు పెరుగడానికి దోహదపడుతుంది. దేశ వ్యాప్తంగా ఏటా లక్ష మంది విద్యార్థులను అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తుంది.

అర్హత పరీక్ష ఇలా..

ప్రతి రాష్ట్రం తమ ప్రభుత్వ ఆధీనంలోని ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా అర్హత పరీక్ష నిర్వహిస్తుంది. అర్హత పరీక్షను ఏటా విద్యా సంవత్సరంలో నవంబర్‌ మొదటి ఆదివారం రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో జిల్లా విద్యాశాఖాధికారి, మండల విద్యాధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తుంది. ఈ సారి నవంబర్‌ 3 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులు మాత్రమే అర్హత పరీక్షకు అర్హులు. గురుకుల పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అర్హత లేదు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏడో తరగతిలో 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం) సాధిం చి ఉండాలి.తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,50,000 మించరాదు.

దరఖాస్తు ఈలా..

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హత పరీక్షలకు అర్హులు. పరీక్ష ఫీజు బీసీ, ఓసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.50 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అర్హత పరీక్షకు ఫీజు చెల్లించడానికి ఆగస్ట్‌ 29 వరకు అవకాశం ఉంది. పరీక్ష ఫీజు చెల్లించిన తరువాత నామినల్‌ రోల్స్‌ రెండు సెట్లు తయారు చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం చేయించి ఈనెల 30వ తేదీలోగా జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అందజేయాలి. దరఖాస్తు ఫారంతో పాటు ఫీజు, రసీదు, తహసీల్దార్‌చే జారీ చేయబడిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఏడో తరగతి మార్కుల మెమో, 2 సెట్లు జత చేయాలి.

పరీక్ష విధానం..

నవంబర్‌ 3న ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. వీటిలో పేపర్‌-1, పేపర్‌-2 ఉంటాయి. మెంటల్‌ ఎబీలీటీకి 90 మార్కులు, స్కాలాస్టిక్‌ ఎచివ్‌మెంట్‌కు 90 మార్కులు. మొత్తం 180 మార్కుల ప్రశ్నపత్రం మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూ మిడీయంలో ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు కాగా వికాలంగ విద్యార్థులకు ఆదనంగా అరగంట సమయం కేటాయిస్తారు. ఆరు, ఏడు తరగతులతో పాటు 8వ తరగతికి సంబంధించిన గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం అంశాలపై 90 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో గణితం 20, సాంఘిక, సామాన్య శాస్ర్తాలకు 35 మార్కులు చోప్పున ఉంటా యి. జనవరి లేదా ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్‌ ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ను ప్రకటిస్తారు.

ఎంపిక విధానం..

జిల్లా ప్రాతిపదికన మెరిట్‌ లిస్ట్‌ను రూపోందిస్తారు. ప్రతి పేపర్‌లో కనీసం అర్హత మార్కులు సాధించాలి. జనరల్‌ కేటగిరికి చెందిన విద్యార్థులు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 32 శాతం మార్కులు సాధిస్తే అర్హత సాధిస్తారు. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు నెలకు రూ.1000 చోప్పున ఏడాదికి రూ.12,000 వేలు విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైతే ఏడాదికి రూ.12 వేలు"

Post a Comment