ఫ్రీగా ఇ-పాన్‌ డౌన్‌లోడ్!

కీలకమైన డాక్యుమెంట్లలో పాన్ కార్డు ఒకటి. ఇప్పుడు పాన్ కార్డును లేదా దీని డిజిట్ కాపీని ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించొచ్చు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పాన్ కార్డు, ఇ-పాన్‌కు ఒకేరకమైన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్ఎస్‌డీఎల్ టీఐఎన్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ), యూటీఐ-ఐటీఎస్ఎల్ (యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్) సంస్థలు పాన్ కార్డు జారీ చేసేందుకు 



ఆదాయపు పన్ను నుంచి అనుమతి పొందాయి. పాన్ కార్డు కలిగిన వారు ఈ రెండు సంస్థల వెబ్‌సైట్లకు వెళ్లి ఇ-పాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే కొత్తగా పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారు ఇ-పాన్‌ను ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది

ఇకపోతే ఇతరులు కేవలం రూ.8.26 చెల్లించి ఇ-పాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇ-పాన్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే...కొత్తగా పాన్ కార్డుకు దరఖాస్తుకు చేసుకున్న ప్రతిఒక్కరూ లేదా యూటీఐ ఐటీఎస్ఎల్ పోర్టల్ ద్వారా పాన్ కార్డులో ఇటీవల మార్పులు చేసుకున్నవారు ఇ-పాన్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికి పాన్ నెంబర్, పుట్టిన తేదీ తెలిస్తే సరిపోతుంది. https://www.myutiitsl.com/PAN_ONLINE/ePANCard లింక్‌పై క్లిక్ చేసి ఇ-పాన్ పొందొచ్చు. ఇక్కడ పాన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

తర్వాత ఇ-పాన్ డౌన్‌లోడ్ లింక్ ఈమెయిల్ లేదా ఫోన్‌కు వస్తుంది. పాన్ దరఖాస్తుదారుల ఫోన్ లేదా ఈమెయిల్‌కు వచ్చిన లింక్ కేవలం నెల రోజులు మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే కేవలం మూడు సార్లు మాత్రమే ఉపయోగించగలం. ఇకపోతే ఎన్ఎస్‌డీఎల్ పోర్టల్ నుంచి ఇ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే పాన్ కార్డు అప్లికేషన్ అక్‌నాలెడ్జ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఫ్రీగా ఇ-పాన్‌ డౌన్‌లోడ్!"

Post a Comment