సెప్టెంబర్ 1 నుంచి : Zero Balance అకౌంట్లపై RBI కొత్త రూల్
మీరు సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులా? మీకో గుడ్ న్యూస్. జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై నిబంధలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) సడలించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ (BSBD) అకౌంట్లపై కొత్త అడ్వైజరీ నోట్ విడుదల చేసింది. అన్ని ప్రైమరీ (పట్టణ) కో-ఆపరేటీవ్ బ్యాంకులు, అన్ని స్టేట్ లేదా కేంద్ర కో-ఆపరేటీవ్ బ్యాంకుల్లో కొత్త నిబంధనలను చేర్చింది.
కనీస సదుపాయాల్లో మార్పులు :
BSBD అకౌంట్లను జీరో బ్యాలెన్స్ అకౌంట్లగా చెప్పవచ్చు. కొన్ని ప్రాథమిక సౌకర్యాలను కస్టమర్లకు అందించేందుకు సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లను ఉచితంగా ఆఫర్ చేస్తుంటాయి
ITR Filing : పన్నుదారుల కోసం E-Filing Lite పోర్టల్
మినిమం బ్యాలెన్స్ అవసరం లేకుండా ఉచితంగా సదుపాయాలను కస్టమర్లకు అందించాలని సూచించింది. BSBD అకౌంట్లను కూడా సాధారణ బ్యాంకింగ్ సర్వీసు మాదిరిగానే అన్ని బ్యాంకులు పరిగణించాలని పేర్కొంది. కస్టమర్ల అకౌంట్లలో పరిమితి లావాదేవీలు, మినిమం బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయడం ఇష్టం లేని అకౌంట్లకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ సరిపోతుంది. సెప్టెంబర్ 1, 2019 నుంచి అమల్లోకి వచ్చే జీరో బ్యాలెన్స్ అకౌంట్లలో ప్రాథమిక కనీస సౌకర్యాలు ఏంటో ఓసారి లుక్కేద్దాం.
i) బ్యాంకు బ్రాంచ్‌ల్లో లేదా ATM లేదా క్యాష్ డిపాజిట్ మిషన్లలో నగదు డిపాజిట్ చేయవచ్చు.
ii) ఏదైనా ఎలక్ట్రానిక్ ఛానల్ ద్వారా లేదా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాలు డ్రా చేసిన చెక్కుల డిపాజిట్ లేదా సేకరణ ద్వారా డబ్బు రసీదు లేదా క్రెడిట్ చేయడం.
iii) ఒక నెలలో ఎన్ని సార్లు డిపాజిట్ చేశారు అనేదానిపై పరిమితి లేదు.
iv) ఒక నెలలో కనీసం 4 సార్లు విత్ డ్రా పరిమితి (ATM విత్ డ్రాలతో కలిపి)
v) ATM card లేదా ATM-cum-Debit Card
జీరో బ్యాలెన్స్ ఓపెన్ చేయాలంటే :
* బ్యాంకులు తమ కస్టమర్లకు అదనంగా వాల్యూ యాడెడ్ సర్వీసులు అందించాలనుకుంటే అందించవచ్చు.
* అదనపు సర్వీసుల్లో (చెక్ బుక్ జారీ చేయడంతో కలిపి) అదనంగా ఛార్జీలు విధించవచ్చు లేదా విధించకపోవచ్చు.
* ఇలాంటి అదనపు సర్వీసులు నాన్ BSBD అకౌంట్లగా మారవు.
* జీరో బ్యాలెన్స్ అకౌంట్లకు కనీస సౌకర్యాలను ఉచితంగా అందించాల్సి ఉంటుంది.
* జోరో బ్యాలెన్స్ అకౌంట్లలో అదనపు సర్వీసుల కోసం.. కనీస నిల్వ ఉండాలని కస్టమర్లకు బ్యాంకులు సూచించరాదు.
* జీరో బ్యాలెన్స్ అకౌంట్ దారుడు.. ఒక బ్యాంకులో ఇతర ఏ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయరాదు.
* ఒక బ్యాంకులో సేవింగ్స్ బ్యాంకు లేదా BSBD అకౌంట్ ఏదో ఒకటి ఉండాలి. రెండు అకౌంట్లు ఉండేందుకు అర్హత లేదు.
* బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉండి... జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ముందుగా సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి.
* జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన 30 రోజుల్లోలా సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
* జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు.. బ్యాంకుకు ఓ డిక్లరేషన్ ఫాం ఇవ్వాల్సి ఉంటుంది.
* మరో ఇతర బ్యాంకులో జీరో బ్యాలెన్స్ అకౌంట్ లేదని డిక్లరేషన్ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది
0 Response to "సెప్టెంబర్ 1 నుంచి : Zero Balance అకౌంట్లపై RBI కొత్త రూల్"
Post a Comment