త్వరలో మొబైల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత... అదొక డేటాబ్యాంక్‌గా మారిపోయింది. మనకు సంబంధించి అన్ని వివరాలూ అందులోనే నిక్షిప్తం చేసుకుంటున్నాం. అలాంటి సందర్భంలో ఆ ఫోన్‌ పోగొట్టుకుంటే, మన రహస్య సమాచారం అంతా పోగొట్టుకున్నట్లే.



 ముఖ్యంగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వంటి ట్రాన్సాక్షన్స్‌ వచ్చిన తర్వాత దాదాపుగా మొబైల్‌ ద్వారానే జరుగుతున్నాయి. అలాంటి సందర్భంలో ఫోన్‌ పోగొట్టుకోవడం అంటే ఎంత నష్టపోతామో చాలామందికి అనుభవమే. అయితే... ఇలా పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్స్‌ ఆనవాళ్లు పట్టుకునేందుకు అవసరమైన ట్రాకింగ్‌ విధానాన్ని ఆగస్టులో అందుబాటులోకి రానుంది. మొబైల్‌ఫోన్‌ నుంచి సిమ్‌ కార్డు తీసేసినా, ఐఎంఈఐ నంబరును మార్చేసినా ట్రాకింగ్‌ చేయగలిగేంత శక్తివంతంగా ఈ విధానం ఉంటుంది

అంతేగాకుండా పోయిన ఫోను ఇతరత్రా ఏ నెట్‌వర్క్‌పైనా పనిచేయకుండా చేయగలిగేలా సీఈఐఆర్‌ టెక్నాలజీ ఉంటుంది. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ (సీ-డాట్‌) ఇప్పటికే దీనికి సంబంధించిన టెక్నాలజీని సిద్ధం చేసింది. ఆగస్టు నుంచి సర్వీసులు ప్రారంభం కావొచ్చని చెబుతోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "త్వరలో మొబైల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ"

Post a Comment