ఉద్యోగాలకు నవోదయం!

2370 పోస్టులకు ప్రకటన విడుదల

ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకుండా పిల్లల్లో ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో నవోదయ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారిలోని ప్రతిభకు పదును పెట్టవచ్చని ఇక్కడి సిబ్బంది నిరూపిస్తున్నారు. ఈ యజ్ఞంలో భాగస్వాములుగా చేరే అవకాశం ఇప్పుడు వచ్చింది. నవోదయ సంస్థల్లో ఖాళీలకు ప్రకటన వెలువడింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో మెరిట్‌ సాధిస్తే ఈ ఉద్యోగాలను సాధించుకోవచ్చు.

పోస్టు గ్రాడ్యుయేట్‌, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లతోపాటు స్టాఫ్‌నర్సు, ఎల్‌డీసీ...మొదలైన ఉద్యోగాల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి ప్రకటన వెలువరించింది.




మొత్తంగా 2370 ఖాళీలు ఉన్నప్పటికీ వీటిలో సింహభాగం ఉపాధ్యాయ పోస్టులే!

పరీక్ష విధానం 
పీజీటీ పోస్టులకు: రీజనింగ్‌ ఎబిలిటీ 15, జనరల్‌ అవేర్‌నెస్‌ 15, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 20, సబ్జెక్టు పరిజ్ఞానం (అభ్యర్థి దరఖాస్తు చేసుకుకున్న పోస్టు) నుంచి వంద ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష వ్యవధి 3 గంటలు. లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ పరీక్షను 30 మార్కులకు నిర్వహిస్తారు. 30 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్‌, హిందీ ఒక్కో సబ్జెక్టు నుంచి 15 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో సాధించిన మార్కులను పోస్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. అయితే అర్హత సాధించడం తప్పనిసరి.రెండు సబ్జెక్టుల్లోనూ విడిగా 33.33 శాతం మార్కులు పొందితేనే మిగిలిన ప్రశ్నపత్రాన్ని మూల్యాంకనం చేస్తారు


టీజీటీ పోస్టులకు: రీజనింగ్‌ ఎబిలిటీ 10, జనరల్‌ అవేర్‌నెస్‌ 10, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 15, దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు నుంచి వంద చొప్పున 135 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. పరీక్ష వ్యవధి 3 గంటలు. మరో విభాగం లాంగ్వేజ్‌ కాంపిటెన్సీకి 45 మార్కులను కేటాయించారు. ఇందులో ఇంగ్లిష్‌, హిందీతోపాటు ప్రాంతీయ భాషలో 15 చొప్పున 45 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. తుది ఎంపికలో ఈ మార్కులు పరిగణనలోకి తీసుకోరు. ఈ విభాగంలోని ప్రతి సబ్జెక్టులోనూ 33.33 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. పరీక్షలో నిర్ణీత కటాఫ్‌ మార్కులు పొందినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టుల్లోకి తీసుకుంటారు


 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 10.07.2019 
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 09.08.2019 
* పరీక్ష తేది: 2019 సెప్టెంబరు 5-10 మధ్య 
* తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం


విభాగాలవారీగా పోస్టులు

* అసిస్టెంట్‌ కమిషనర్‌: 05 
* పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ): 430 
* ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ): 1154 
* మ్యూజిక్‌ టీచర్‌: 111 
* ఆర్ట్‌ టీచర్‌: 130 
* పీఈటీ మేల్‌: 148 
* పీఈటీ ఫిమేల్‌: 105 
* లైబ్రేరియన్‌: 70 
* ఫిమేల్‌ స్టాఫ్‌ నర్స్‌: 55 
* లీగల్‌ అసిస్టెంట్‌: 01 
* క్యాటరింగ్‌ అసిస్టెంట్‌: 26 
* లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 135. 
రాతపరీక్షలో ప్రతిభ, స్కిల్‌టెస్టు లేదా ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. లీగల్‌ అసిస్టెంట్‌, స్టాఫ్‌ నర్స్‌, క్యాటరింగ్‌ అసిస్టెంట్‌ ఖాళీలను రాతపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఎల్‌డీసీ పోస్టులకు స్కిల్‌/ట్రేడ్‌ టెస్టు ఉంటుంది. మిగిలిన పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 
* పీజీటీ పోస్టులకు సంబంధిత విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు బీఎడ్‌ పూర్తిచేసి ఉండాలి. గరిష్ఠ వయసు 40 ఏళ్లు. 
* టీజీటీ పోస్టులకు సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు బీఎడ్‌. గరిష్ఠ వయసు 35 ఏళ్లు. 
పీజీటీలకు రూ.47,600, టీజీటీలకు రూ.44,900 మూలవేతనం లభిస్తుంది. దీనితోపాటు డీఏ చెల్లిస్తారు. ఎంపికైన ఉపాధ్యాయులకు నవోదయ విద్యాలయాల్లోనే ఉచితంగా వసతి సౌకర్యం కల్పిస్తారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్యోగాలకు నవోదయం!"

Post a Comment