ప్రతి పాఠశాలకు విద్యాకమిటీ
*ప్రతి పాఠశాలకు విద్యాకమిటీ.*
*_బాత్ రూమ్స్ క్లీన్ చేసేవారికి నెలకు రూ.4వేలు_*
*-సి.యం వై.యస్.జగన్మోహన రెడ్డి*
*ప్రతి పాఠశాలకు విద్యాకమిటీ ఏర్పాటు చేయాలని, పాఠశాల అభివృద్ది, పర్యవేక్షణ బాధ్యత కమిటీదేనని స్పష్టం చేశారు. రాజకీయాలకు దూరంగా విద్యా కమిటీలు ఉండాలని అన్నారు. క్రమం తప్పకుండా సమావేశమై స్కూలు బాగోగులను విద్యా కమిటీలు
పర్యవేక్షించాలని తెలిపారు. స్కూల్లో బాత్‌రూమ్స్ క్లీన్ చేసేవారికి రూ.4 వేలు, క్లీనింగ్ సామాగ్రి కోసం వెయ్యి రూపాయాలు కేటాయించాలని తెలిపారు. స్కూలు, కాలేజీ ఫీజుల మానిటరింగ్ అండ్ రెగ్యులేటరి కోసం ఒక నియంత్రణ వ్యవస్థను
తీసుకొస్తున్నామని ప్రకటించారు. దీనికోసం ఈ అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు.*
0 Response to "ప్రతి పాఠశాలకు విద్యాకమిటీ"
Post a Comment