"దివ్యాంగ విద్యార్ధుల" కి స్కాలర్‌షిప్..ఆఖరు తేదీ

చదువుకోవాలనే తపనతో తమ వైకాల్యాన్ని సైతం జయిస్తూ ఉన్నత చదువులకై పోటీ పడుతున్న దివ్యంగా విద్యార్ధులకి సాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ దివ్యాంగులకి ఉపకార వేతనాలని అందించే దశలో ఈ సాయాన్ని అందిస్తోంది.తొమ్మిదో తరగతి నుంచీ పీహెచ్ డీ వరకూ చదివే వారు ఎవరైనా సరే ఈ స్కాలర్‌షిప్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.






 ప్రి మెట్రిక్ స్కాలర్‌షిప్: 
అర్హత : 9, 10 తరగతుల విద్యార్థులకు
స్కాలర్‌షిప్పుల సంఖ్య : 20,000

2) పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ 
అర్హత : ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి మాస్టర్ డిగ్రీ లేదా డిప్లొమా స్థాయి వరకు
స్కాలర్‌షిప్పుల సంఖ్య : 17,000 

3) టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్పులు 
అర్హత : గుర్తించిన 240 అత్యుత్తమ విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సుల్లో చేరినవారికి.
స్కాలర్‌షిప్పుల సంఖ్య : 300

4) ఓవర్సీస్ స్కాలర్‌షిప్పులు 
అర్హత : విదేశాల్లో మాస్టర్ డిగ్రీ, డాక్టొరేట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు
స్కాలర్‌షిప్పులు : 20

5) దివ్యాంగుల నేషనల్ ఫెలోషిప్పులు 
అర్హత : ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరినవారికి
స్కాలర్‌షిప్పుల సంఖ్య : 200

6) ఫ్రీ కోచింగ్ 
అర్హత : పభ్రుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ శిక్షణకు; సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు
స్కాలర్‌షిప్పుల సంఖ్య: 2000

అర్హతలు : విద్యార్థులు ఏ స్కాలర్‌షిప్పుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కనీసం 40శాతం పైగా వైకల్యం ఉండాలి. అలాగే ఇతర ఏ స్కాలర్‌షిప్పులూ పొందనివారే వీటికి అర్హులు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్.
చివరితేది ప్రిమెట్రిక్ : 15.10.2019, పోస్ట్ మెట్రిక్ : 31.10.2019, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ : 31.10.2019. 
మరిన్ని వివరాలకై వెబ్‌సైట్:http://disabilityaffairs.gov.in/content/

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to ""దివ్యాంగ విద్యార్ధుల" కి స్కాలర్‌షిప్..ఆఖరు తేదీ"

Post a Comment