APSET: ఆగస్ట్ 5 నుంచి ఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ... అక్టోబర్ 20న పరీక్ష
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-APSET నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్ apset.net.in ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ సెట్ నిర్వహిస్తోంది. ఏపీసెట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 5న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 12 చివరి తేదీ. ఆ తర్వాత ఆలస్య రుసుముతో దరఖాస్తు చేయొచ్చు. మాస్టర్స్ డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవాళ్లు ఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో పాసైతే చాలు. పరీక్షను అక్టోబర్ 20న నిర్వహించబోతోంది ఆంధ్ర యూనివర్సిటీ. ఉదయం 9:30 నుంచి 10:30 వరకు మొదటి సెషన్, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెండో సెషన్ ఉంటుంది
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 ఆగస్ట్ 5
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 11
రూ.1,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 19
రూ.2,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 26
రూ.5,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 3 (ఎగ్జామినేషన్ సెంటర్ విశాఖపట్నం మాత్రమే)
ఏపీ సెట్ పరీక్ష- 2019 అక్టోబర్ 20
ఏపీసెట్‌లో 30 సబ్జెక్ట్స్ ఉంటాయి. కొత్తగా విజువల్ ఆర్ట్స్ కోర్సును చేర్చారు. అభ్యర్థులందరికీ పేపర్ 1 ఒకేలా ఉంటుంది. పేపర్ 2 సబ్జెక్ట్స్ వారీగా ఉంటాయి
APSET Notification: ముఖ్యమైన తేదీలు ఇవే...
ఏపీసెట్ నోటిఫికేషన్- 2019 జూలై 28ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 ఆగస్ట్ 5
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 11
రూ.1,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 19
రూ.2,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 26
రూ.5,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 3 (ఎగ్జామినేషన్ సెంటర్ విశాఖపట్నం మాత్రమే)
ఏపీ సెట్ పరీక్ష- 2019 అక్టోబర్ 20
0 Response to "APSET: ఆగస్ట్ 5 నుంచి ఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ... అక్టోబర్ 20న పరీక్ష"
Post a Comment