స్పెషల్ అలవెన్స్ రద్దు!
- సీఆర్డీయే, ఏడీసీల్లోని డిప్యుటేషన్ ఉద్యోగుల వేతనాల్లో కోత
- ముందే చెప్పిన 'ఆంధ్రజ్యోతి'
అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి):వివిధ ప్రభుత్వ శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి, ఏపీసీఆర్డీయే, ఏడీసీల్లో పని చేస్తున్న
అధికారులు, ఉద్యోగులకు వారి బేసిక్(మూల వేతనం)లో 30 శాతంగా ఇస్తున్న స్పెషల్ అలవెన్స్‌ను రద్దు చేస్తూ సీఆర్డీయే కమిషనర్, ఏడీసీ సీఎండీ పి.లక్ష్మీనరసిం హం ఉత్తర్వులు జారీ చేశారు.
రాజధానిలో నిర్మా ణ పనులు వేగంగా జరిగేలా చూడడానికి గత ప్రభుత్వం వీరిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చింది.
కానీ కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతల్లో రాజధాని లేకపోవ డం, ప్రస్తుతం అమరావతి వేగం మందగించడంతోపాటు ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని స్పెషల్ అలవెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నా రు
ఈ దిశగా ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారంటూ ఇటీవల 'ఆంధ్రజ్యోతి' ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైది. స్పెషల్ అలవెన్స్ రద్దు చేయడం వల్ల మొత్తం 160 మంది అధికారులు, ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఇప్పటి వరకూ వీరు తమ స్థాయిని బట్టి ఒక్కొక్క రు నెలకు కనీసం రూ.10వేల నుంచి రూ.25వేల వరకు అలవెన్స్ రూపంలో పొందుతున్నారు. ఇవి రద్దు కావడంతో ఈ సంస్థలకు కలిపి నెలకు సుమారు రూ.35 లక్షల వరకూ ఆదా అవుతుందని తెలుస్తోంది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో సీఆర్డీయే, ఏడీసీలకు తమ అవసరం లేదని ఇప్పటికే పలువు రు అధికారులు, ఉద్యోగులు భావిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రభావంతో మిగిలిన వారూ తిరుగుముఖం పడతారని సమాచారం
0 Response to "స్పెషల్ అలవెన్స్ రద్దు!"
Post a Comment