రిటైర్మెంట్ వయసు 70కి పెంచాలి! జనాభా పెరుగుదల మందగిస్తోంది సగటు జీవనకాల పరిమితి పెరుగుతోంది 60 ఏళ్లు దాటేవారి సంఖ్య 24 కోట్లు పనిచేసే వయసు వారి సంఖ్య భారీగా పెరగొచ్చు 5-14 వయసు వారి సంఖ్య తగ్గొచ్చు పాఠశాలలను విలీనం చేయాలి చాలా రాష్ట్రాల్లో గర్భధారణ రేటులో తగ్గుదల నిర్దిష్ట చర్యలు అవసరం.. ఆర్థిక సర్వే హెచ్చరిక వచ్చే 20 ఏళ్లలో వృద్ధ భారతం
న్యూఢిల్లీ, జూలై 3: ఇప్పటిదాకా పదవీ విరమణ వయసు సగటున 60 ఏళ్లు... దీన్ని 70 సంవత్సరాలకు పెంచే రోజులు రానున్నాయి..!
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు లోక్సభకు సమర్పించిన ఆర్థిక సర్వే అనేక కీలక, ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. తీసుకోవాల్సిన చర్యలనూ పేర్కొంది. ఇందులో ప్రధానమైనది ‘వయో లబ్ధి’ (డెమొగ్రాఫిక్ డివిడెండ్).. ‘దేశంలో ‘జనాభా పెరుగుదల మందగిస్తోంది. వృద్ధుల సంఖ్య పెరగబోతోంది.
2030 నాటికే చాలా రాష్ట్రాల్లో ముదిమి పైబడ్డ వారి సంఖ్య భారీగా పెరగబోతోంది. చాలా మందికి ఆశ్యర్యం కలిగించే విషయం ఏంటంటే... ఇప్పటికే పందొమ్మిదేళ్ల లోపు జనాభా గణనీయంగా పడిపోయింది. 2011లో 41 శాతం ఉండగా 2041 నాటికి 25 శాతానికి తగ్గిపోబోతోంది.
దీనికి కారణం...గర్భధారణ సామర్థ్యం రేటు (టీఎ్ఫఆర్) తగ్గిపోవడం.! మరోపక్క 60 ఏళ్లు పైబడ్డ వారి జనాభా 2011లో 8.6 శాతం ఉండగా 2041 నాటికి అది 16 శాతానికి పెరగబోతోంది’’ అని సర్వే కుండబద్దలు కొట్టింది. ‘‘ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, పంజాబ్, హిమాచల్, బెంగాల్, మహారాష్ట్రల్లో టీఎ్ఫఆర్.. రీప్లే్సమెంట్ స్థాయి కంటే దిగువన ఉంది. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కాస్త పైనే ఉన్నప్పటికీ వాటిలో కూడా రాబోయే దశాబ్ద కాలంలో తగ్గిపోతుంది. ఫలితంగా వయసుమీరే వారి సంఖ్య పెరగనుంది’’ అని వివరించింది.
‘‘జనాభాలో పనిచేసే వయసువారి సంఖ్య (అంటే 15 నుంచి 64ఏళ్ల మధ్య ఉన్నవారి సంఖ్య) - పనిచెయ్యని వయసువారి సంఖ్య (పదిహేనేళ్ల లోపు- 65 ఏళ్లపైన) కంటే ఎక్కువ కానుంది.
2021-31 మధ్య కాలంలో ఈ పనిచేసే వయసు (వర్కింగ్ ఏజ్) వారి సంఖ్య దాదాపు కోటి మంది దాకా పెరగబోతోంది. ఒక అంచనా ప్రకారం.. రాబోయే ఇరవయ్యేళ్లలో అంటే 2041 నాటికి దేశంలో అరవయ్యేళ్లు దాటే వారి సంఖ్య 24 కోట్లకు చేరనుంది. 2011లో వీరి సంఖ్య 10.42 కోట్లుంది. దేశంలో గర్భధారణ రేటు గణనీయంగా పడిపోతోంది. ఎంతలా అంటే దాన్ని పునరుద్ధరించలేనంతగా! మరోపక్క ..మనిషి సగటు జీవనకాల పరిమితి కూడా పెరగబోతోంది. ఇవన్నీ జనాభాలో వయసు మీరే వారి సంఖ్యలో పెరుగుదలకు దారితీస్తుంది
. ఫలితంగా ప్రభుత్వాలు, కంపెనీలు, వివిధ సంస్థలు పదవీ విరమణ వయసును
మనిషి సగటు జీవనకాల పరిమితి కూడా పెరగబోతోంది. ఇవన్నీ జనాభాలో వయసు మీరే వారి సంఖ్యలో పెరుగుదలకు దారితీస్తుంది. ఫలితంగా ప్రభుత్వాలు, కంపెనీలు, వివిధ సంస్థలు పదవీ విరమణ వయసును 70 ఏళ్లకు పెంచాల్సి ఉంటుంది’’ అని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.
వచ్చే పదేళ్ల కాలంలో 5-14 వయసున్న వారి సంఖ్య కూడా తగ్గిపోతుందని, దీని వల్ల పాఠశాలలను విలీనం చేసే ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.
0 Response to "రిటైర్మెంట్ వయసు 70కి పెంచాలి! జనాభా పెరుగుదల మందగిస్తోంది సగటు జీవనకాల పరిమితి పెరుగుతోంది 60 ఏళ్లు దాటేవారి సంఖ్య 24 కోట్లు పనిచేసే వయసు వారి సంఖ్య భారీగా పెరగొచ్చు 5-14 వయసు వారి సంఖ్య తగ్గొచ్చు పాఠశాలలను విలీనం చేయాలి చాలా రాష్ట్రాల్లో గర్భధారణ రేటులో తగ్గుదల నిర్దిష్ట చర్యలు అవసరం.. ఆర్థిక సర్వే హెచ్చరిక వచ్చే 20 ఏళ్లలో వృద్ధ భారతం"
Post a Comment