గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 7 యాప్‌ల తొలగింపు



గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 7 యాప్‌ల తొలగింపు



వాషింగ్టన్‌: వ్యక్తుల గోప్యతకు భంగం కలిగిస్తున్న 7 యాప్‌లను గూగుల్‌ తాజాగా తన 'ప్లే స్టోర్‌' నుంచి తొలగించింది. జీవిత భాగస్వాములు, పిల్లలు, ఉద్యోగులపై నిఘా పెట్టేందుకుగాను వాటిని కొందరు వాడుతున్నట్లు గుర్తించింది. ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న కొన్ని యాప్‌లు వ్యక్తుల గోప్యతకు ముప్పుగా పరిణమిస్తున్నాయని ఇటీవల గూగుల్‌ దృష్టికి వచ్చింది. సదరు 'స్పైవేర్‌'లు తమ ఫోన్‌లో ఉన్న సంగతిని కూడా బాధితులు తెలుసుకోలేరని సంస్థ గుర్తించింది. దీంతో ప్లే స్టోర్‌ నుంచి వాటిని నిషేధించింది


ప్లే స్టోర్‌ నుంచి తొలగించిన యాప్‌లివీ.. 
1) ట్రాక్‌ ఎంప్లాయీస్‌ చెక్‌ వర్క్‌ ఫోన్‌ ఆన్‌లైన్‌ స్పై ఫ్రీ 
2) స్పై కిడ్స్‌ ట్రాకర్‌ 
3) ఫోన్‌ సెల్‌ ట్రాకర్‌ 
4) మొబైల్‌ ట్రాకింగ్‌ 
5) స్పై ట్రాకర్‌ 
6) ఎస్‌ఎంఎస్‌ ట్రాకర్‌ 
7) ఎంప్లాయీ వర్క్‌ స్పై


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 7 యాప్‌ల తొలగింపు"

Post a Comment