Whatsapp ఆడియో మెసేజ్‌లు సీక్రెట్‌గా వినాలా?

Whatsappలో voice calls చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ చాలామంది అప్పటికప్పుడు చిన్నచిన్న వాయిస్ మెసేజ్ లు రికార్డు చేసి ఒకరికొకరు పంపించుకుంటూ ఉంటారు

మీ దగ్గర headphone ఉంటే ఫర్వాలేదు గానీ చాలా సందర్భాల్లో మన సన్నిహితులు అలా పంపించిన ఆడియో మెసేజ్‌లను పబ్లిక్‌లో ఎలా వినాలో అర్థం కాక తమకంటూ కొంత ప్రైవసీ లభించే వరకు చాలామంది ఆ ఆడియో మెసేజ్‌లను వినకుండానే అలా వదిలేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం Whatsappలో ఏదైనా ఆడియో మెసేజ్ tap చేసిన వెంటనే అది మీ ఫోన్లోని loudspeaker ద్వారా పెద్దగా అందరికీ వినిపిస్తుంది. అందుకే ఆడియో మెసేజ్‌లు పబ్లిక్లో వినాలంటే అందరూ వెనకాడుతుంటారు


 నేపథ్యంలో ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవడం ద్వారా మీ దగ్గర హెడ్ఫోన్ లేకపోయినా ఆడియో మెసేజ్లను మీకు మాత్రమే వినిపించేలా చేసుకోవచ్చు. దీనికి మీరు చేయవలసిందల్లా చాలా సింపుల్. మీరు మీ మిత్రుల ఛాట్ విండోలో ఏ మెసేజ్ అయితే సీక్రెట్‌గా వినాలనుకుంటున్నారో ఆ మెసేజ్‌ని tap చేసి, ఆలస్యం చేయకుండా మీ చేతిలో ఉన్న ఫోన్‌ని మీ చెవికి ఆనించుకోండి. దాంతో ఆ విషయం వాట్సప్ గ్రహించి ఆడియోని స్పీకర్ ద్వారా కాకుండా ఫోన్లోని ఇయర్‌పీస్ ద్వారా మీకు మాత్రమే వినిపించేలా వినిపిస్తుంది.



అంతేకాదు, ఆడియో మెసేజ్‌ని ప్రారంభం నుండి ఇది మీకు వినిపిస్తుంది. ప్లే బటన్ ట్యాప్ చేసిన వెంటనే కొద్దిగా అలర్ట్‌గా ఉంటే చాలు, ఇక మీద ఎంత పబ్లిక్‌లో ఉన్నా ఆడియో మెసేజ్‌లు నిస్సంకోచంగా వినొచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Whatsapp ఆడియో మెసేజ్‌లు సీక్రెట్‌గా వినాలా?"

Post a Comment