NEFT, RTGS నగదు బదిలీలపై జూలై 1 నుంచి ఛార్జీలు ఉండవు - ఆర్బీఐ
జూలై 1వ తేదీ నుంచి ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీల ద్వారా జరిపే నగదు బదిలీలపై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది.
ఈ మేరకు ఈరోజు (జూన్ 11వ తేదీ మంగళవారం) బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది.
జాతీయ ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ (ఎన్‌ఈఎఫ్‌టీ), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్) సేవలను ఉపయోగించుకుని నగదు బదిలీ జరిపితే ఇప్పటి వరకూ ఆయా బ్యాంకుల నుంచి ఆర్బీఐ కొంత రుసుము వసూలు చేస్తోంది.
అయితే, 2006లో ప్రవేశపెట్టిన సేవల ఈ వ్యవస్థ, రుసుము చెల్లింపులపై కొన్ని బ్యాంకులు గత కొద్ది సంవత్సరాలుగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి
ఆర్టీజీఎస్ ద్వారా రూ.
నగదును బదిలీ చేస్తున్న బ్యాంకు ఈ రుసుమును ఖాతాదారుడి నుంచి వసూలు చేస్తోంది.
కానీ, నగదును స్వీకరించిన బ్యాంకుకు కానీ, ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ వ్యవస్థలను నిర్వహించే సంస్థలకు కానీ ఈ రుసుము నుంచి చెల్లించాల్సిన నిర్వహణ వ్యయాలను అందించటం లేదని తమకు ఫిర్యాదులు అందాయని ఆర్బీఐ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఈనెల 6వ తేదీన జరిగిన సమావేశంలో ఈ సేవల ద్వారా జరిపే నగదు బదిలీలపై రుసుములను ఎత్తివేయాలని ఆర్బీఐ నిర్ణయించింది
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో నగదు బదిలీలు బాగా పెరిగాయని, ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో నగదు బదిలీలు, చెల్లింపులకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూసేందుకు గాను ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ సేవలపై విధిస్తున్న రుసుములను తొలగిస్తున్నట్లు ఆర్బీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాము కల్పించిన ఈ ప్రయోజనాన్ని ఖాతాదారులకు బదిలీ చేయాలని, అన్ని బ్యాంకులు జూలై 1వ తేదీ నుంచి ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీల ద్వారా నగదు బదిలీలు జరిపే ఖాతాదారుల నుంచి కూడా ఎలాంటి రుసుములూ వసూలు చేయొద్దని ఆర్బీఐ ఆదేశించింది
0 Response to "NEFT, RTGS నగదు బదిలీలపై జూలై 1 నుంచి ఛార్జీలు ఉండవు - ఆర్బీఐ"
Post a Comment