కేంద్ర బడ్జెట్ పై కసరత్తు-ఆదాయపన్ను మార్పులు పై వేతనజీవులు డిమాండ్లు

  • రేపటి నుంచి ఆర్థిక మంత్రి భేటీలు
  • పన్నుల భారం తగ్గించాలంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ తయారీ ప్రక్రియ ఊపందుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూలై 5న లోక్‌సభలో 2019-20 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించేందుకు మంగళవారం నుంచి ఆమె ఆర్థిక నిపుణులు, బ్యాంకర్లు, పారిశ్రామిక, వాణిజ్య సంఘాలతో సమావేశమవుతున్నారు. ఈ నెల 23 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ నెల 20న జరిగే జీఎ్‌సటీ మండలి సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా కేంద్ర బడ్జెట్‌ ఎలా ఉండాలనే దానిపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేస్తారని భావిస్తున్నారు.
 
ఇవే సవాళ్లు
తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్‌ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. జీడీపీ వృద్ధి రేటు ఇప్పటికే ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మొండి బకాయిల భారంతో కుంగిపోతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆశతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. మరోవైపు నిధుల కొరతతో ఎప్పుడు ఏ ఎన్‌బీఎ్‌ఫసీ పుట్టి మునుగుతుందోననే పరిస్థితి నెలకొంది. గత ఐదేళ్లుగా ఎగుమతులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఎదుగూబొదుగూ లేకుండా పడి ఉన్నాయి. గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయం ‘సాయం’ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ద్రవ్యలోటు ఏ మాత్రం అదుపు తప్పకుండా, పటిష్టమైన ఆర్థిక చర్యల ద్వారా కొత్త ఆర్థిక మంత్రి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సి ఉంది. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఇందుకోసం ఆమె ఎలాంటి చర్యలు తీసుకుంటారా? అని పారిశ్రామిక, వాణిజ్యవర్గాలతో పాటు ఆర్థిక నిపుణులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
 
పన్ను పోటు తగ్గించాలి
కార్పొరేట్‌ రంగంతో పాటు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులూ వచ్చే బడ్జెట్‌లో పన్నుల భారం మరింత తగ్గించాలని కోరుతున్నారు. పారిశ్రామిక రంగమైతే పెద్ద కంపెనీలకూ 25 శాతం పన్ను రేటును విస్తరించాలని కోరుతోంది. కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎంఏటీ)ను కనీసం ఈ బడ్జెట్‌లో అయినా రద్దు చేయాలని ఇప్పటికే పలు పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశాయి. లేకపోతే ప్రస్తుత పోటీ ప్రపంచంలో భారత కంపెనీలు అంతర్జాతీయంగా పోటీపడడం కష్టమని స్పష్టం చేశాయి.

 
ఇతర డిమాండ్స్‌
  • పన్ను మినహాయింపు కిందికి వచ్చే వ్యక్తిగత వార్షిక ఆదాయ పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి.
  • రూ.లక్ష గరిష్ఠ పరిమితికి లోబడి అందరికీ ప్రామాణిక తగ్గింపు (స్టాండర్డ్‌ డిడక్షన్‌) అమలు చేయాలి.
  • వైద్య ఖర్చుల మినహాయింపు పరిమితిని మరింత పెంచాలి.
  • ఎల్‌టీసీ కింద భోజనాలు, వసతి ఖర్చులనూ అనుమతించాలి.
  • ప్రస్తుతం రూ.5 లక్షల వార్షిక ఆదాయ వర్గాలపై విధిస్తున్న ఐదు శాతం శ్లాబును రూ.7.5 లక్షలకు పెంచాలి.
  • గృహ రుణాల వడ్డీ చెల్లింపులపై ప్రస్తుతం రూ.2 లక్షల వరకు ఉన్న పన్ను మినహాయింపును, రూ.3 లక్షలకు పెంచాలి.
  • సెక్షన్‌ 80సీ మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు 

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "కేంద్ర బడ్జెట్ పై కసరత్తు-ఆదాయపన్ను మార్పులు పై వేతనజీవులు డిమాండ్లు "

  1. Increase taxable income limit up to 5 Lakhs & Please increase 80C limit up to 3 Lakhs

    ReplyDelete