26 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
జులై 10వ తేదీ నుంచి కొత్త బడ్జెట్‌ని ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జూన్ నెలాఖరుకు ముగియనుంది. దీంతో బడ్జెట్ సమావేశాలపై కొత్త ప్రభుత్వం కసరత్తు చేపట్టింది
2018 - 19 ఆర్థిక సంవత్సరానికి రూ. 1, 91,63,000 కోట్లతో ఏపీ బడ్జెట్‌ను అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
ఆర్థిక లోటు ఉండడంతో జూన్ 26వ తేదీ నుంచి నిర్వహించే బడ్జెట్‌పై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, నవరత్నాల అమలుకు ఎంత మేర బడ్జెట్ కేటాయించనున్నారో ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాల అమలుకు ఎలాంటి కార్యచరణన తీసుకున్నారో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం వెల్లడించనుంది. ఇందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది
0 Response to "26 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు"
Post a Comment