వాట్సాప్ వినియోగదారులారా.. సిద్ధంకండి!

ఇది కాస్త ఇబ్బంది కలిగించే విషయమే!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏదైనా ఆసక్తికర వీడియో చూడాలన్నా, లేదా యూట్యూబ్‌లో మంచి సినిమా చూస్తున్నా.. వచ్చే ప్రకటనలు, కాస్త అసహనంగా అనిపిస్తాయి. కొన్ని యాడ్‌లను 5సెకన్ల తర్వాత స్కిప్‌ చేయొచ్చు. ఇంకొన్ని ప్రకటనలను తప్పనిసరిగా మొత్తం చూడాల్సిందే. 


అలాంటిది నిద్రలేచింది మొదలు.. పడుకునే వరకూ వాట్సాప్‌ ప్రపంచంలో విహరించే యువతకు అందులో యాడ్స్‌ వస్తే ఎలా ఉంటుంది? ఇప్పటివరకూ వాట్సాప్‌ యాడ్‌ ఫ్రీ యాప్‌(ప్రకటనలు లేని యాప్‌)గా వినియోగదారులకు ఎన్నో సేవలు అందిస్తూ వస్తోంది

అయితే, ఇక నుంచి వాట్సాప్‌లోనూ ప్రకటనలు కనిపించనున్నాయి. వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌ స్టేటస్‌లో యాడ్స్‌ ఉంటాయట. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌ సదస్సులో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

'2020 నుంచి వాట్సాప్‌లో ప్రకటనలు వస్తాయి. వినియోగదారుల స్టేటస్‌లో అవి కనిపిస్తాయి' అని ఈ సదస్సు హాజరైన ఓలివర్‌ అనే వ్యక్తి ట్వీట్‌ చేశాడు. 

వాట్సాప్‌లో ప్రకటనలు వస్తాయని గతేడాది అక్టోబర్‌లోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఫేస్‌బుక్‌ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వాట్సాప్‌ స్టేటస్‌లో ఫొటోలు, టెక్ట్స్‌, వీడియోలు, యానిమేటెడ్‌ జిఫ్‌లను వినియోగదారులు పంచుకోవచ్చు. 


24 గంటల తర్వాత అవి కనుమరుగవుతాయి. 'వాట్సాప్‌ బీటా ఆండ్రాయిడ్‌ 2.18.305లో ప్రకటనలను తీసుకొస్తోంది. అయితే, ప్రస్తుతం ఇవి వినియోగదారులకు కనిపించవు. 


భవిష్యత్‌లో ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ ఎనేబుల్‌ చేయనుంది' అని వాట్సాప్‌బీటా ఇన్ఫోలో పలు ట్వీట్లు కనిపించిన సంగతి తెలిసిందే

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వాట్సాప్ వినియోగదారులారా.. సిద్ధంకండి!"

Post a Comment