ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ సిద్దం : గతం కంటే తక్కువగా : కొత్త ప్రభుత్వానికి సవాల్‌గా
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ప్రభుత్వంతో పాటుగా కొత్త పీఆర్సీ సైతం అమల్లోకి రానుంది. ఇప్పటికే 11వ వేతన సంఘం విస్తృత స్థాయి అభిప్రాయ సేకరణ తరువాత ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దీని కోసం కొత్తగా ఉద్యోగులకు 29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఇది, 2015 లోఇచ్చిన పిట్‌మెంట్ కంటే తక్కువగా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఈ నివేదిక అందించనున్నారు.
11వ వేతన సంఘం సిద్దం..11వ వేతన సంఘం సిఫార్సులు సిద్దం..
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వేతన సవరణల కోసం 11వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు 2018 మే 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
11వ వేతన సంఘం 13 జిల్లాల్లో పర్యటించి.. అనేక ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిగిపింది. గత పీఆర్సీ సిఫార్సులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని అనేక ఉద్యోగ సంఘాలు కోరాయి. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు 11వ వేతన సంఘం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 29 శాతం ఫిట్‌మెంట్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 2014లో రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. దీంతో..వారితో సమానంగా ఉన్న ఏపీ ఉద్యోగులకు తగ్గించి ఇవ్వటం సరి కాదనే అభిప్రాయంతో ఏపీ ప్రభుత్వం సైతం 42 శాతం ఫిట్‌మెంట్ ఖరారు చేసింది. ఆర్దిక ఇబ్బందుల కారణంగా దశల వారీగా వాటిని నగదు రూపంలో ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాలతో ఒప్పందం చేసుకుంది
ఐఆర్ పార్టీల హామీలు..
ఐఆర్ పైన పార్టీల హామీలు..
ఇక, 11వ వేతన సంఘం సిఫార్సులు అందకపోవటంతో..ముందుగా మధ్యంతర భృతిని అమలు చేయాలని ఏపీలోని ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కోరారు. ఎన్నికల ముందు కావటంతో ముఖ్యమంత్రి సైతం సానుకూలంగా స్పందించి ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇవ్వటానికి అంగీకరించారు. వచ్చే నెల నుండి దీనిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ సైతంఉద్యోగులకు మధ్యంతర భృతి పైన హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇస్తామని స్పష్టం చేసారు. అయితే, మధ్యంతర భృతి 27 శాతం వరకు ఉండగా..వేతన సంఘం 29 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేయటం పైన ఉద్యోగ సంఘాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు పూర్తయినా ఉద్యోగులకు ఇప్పటి వరకు మధ్యంతర భృతి..పీఆర్సీ గురించి పట్టించుకోని విషయాన్ని గుర్తు చేస్తున్నారు
30 శాతం పైగా డిమాండ్..
30 శాతం పైగా ఇవ్వాలని డిమాండ్..
ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీ ప్రతినిధులను కలిసిన సమయంలో ఫిట్‌మెంట్ ఖచ్చితంగా 30 శాతానికి పైగా ఉండాలని అభ్యర్దించారు. ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత వేతన సంఘం తమ సిఫార్సులను అందించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు..పెన్షనర్ల నెల వారీ చెల్లింపుల మొత్తం మూడు వేల కోట్ల పైగా చేరింది. ఇప్పుడు తాజా ప్రతిపాదనలతో మరింత భారం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, ఉద్యోగ సంఘాలు మాత్రం తమ సమస్యలను సైతం దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు కనీస వేతనం కూడా 21 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉద్యోగులకు వేతన సంఘం సిఫార్సుల అమలు..ఫిట్‌మెంట్ పైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది
We demand fitment 48percent
Given the current economic situation, it is not fair to expect a better PRC.
ReplyDelete