10వ తరగతి పూర్తి అయ్యాక IIIT లో ప్రవేశం
S.S.C ఫలితాలలో ఉత్తీర్ణులైన అందరికి శుభాకాంక్షలు. 10వ తరగతి పూర్తి అయ్యాక IIIT లో ప్రవేశం కోరుకునే వారికి ఈ పోస్ట్.
1) మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఐఐఐటీ లు ఉన్నాయి (నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం) ఈ నాలుగు కలిపి 4000 seats ఉంటాయి. ఒక వారం లో నోటిఫికేషన్ రావచ్చు, వీటిల్లో మీ 10వ తరగతి లో వచ్చిన గ్రేడ్స్ ఆధారం గా ప్రవేశం కల్పిస్తారు.
2) 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉంటే మీకు వచ్చిన గ్రేడ్ పాయింట్స్ కి 0.4 పాయిట్స్ కలుపుతారు. ప్రైవేట్ స్కూల్స్ లో చదివిన వాళ్లకి 0.4 పాయింట్స్ కలపరు.
3) ఒకే గ్రేడ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఒకే సీట్ కి పోటీ పడినప్పుడు వాళ్ళ సైన్స్ మరియు మాథ్స్ గ్రేడ్ పాయింట్ చూస్తారు అది కూడా ఒకే లా ఉంటే వయసు ని పరిధిలోకి తీసుకుని ఎక్కువ వయసు ఉన్నవాళ్ళకి ఆ సీట్ కేటాయిస్తారు.
4) స్పోర్ట్స్ మరియు N.C.C కోటా కి 1% సీట్స్ కేటాయిస్తారు.
5) అప్లికేషన్ విడుదల అయ్యాక ఒక నెల టైం ఇస్తారు అప్లికేషన్ తేదీ ముగిశాక అప్లై చేసుకున్న వాళ్ళ గ్రేడ్ ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి 1st లిస్ట్ ని రిలీజ్ చేసి వాళ్ళకి కౌన్సెలింగ్ కి పిలుస్తారు. 1st లిస్ట్ లో మిగిలిన సీట్స్ ని బట్టి సెకండ్ లిస్ట్ విడుదల చేస్తారు.
6) అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్ కి ఒక LAPTOP, 2 జతల యూనిఫామ్, స్పోర్ట్స్ షూ, ఫార్మల్ షూ, బ్లాంకెట్స్ ఇస్తారు.
7) ఫీజు 36000/- ( ట్యూషన్ ఫీ 6000/- మరియు హాస్టల్ ఫీ 30,000 ఉంటుంది) ఫీజు
రీ ఎంబెర్స్మెంట్, స్కాలర్ షిప్ సౌకర్యం ఉన్నవి.
8) ఈ మధ్య ప్రవేశపెట్టిన 10% అగ్రవర్ణ రిజర్వేషన్లు కి సంబంధించి EWS( Economical Weaker Section) certificate మీ సేవలో అప్లై చేసుకోండి.
9) ఈ వివరాలు నాకు తెలిసినంత వరకు సరైనవి.
CLICK HERE TO MORE INFORMATION
పూర్తి వివరాలు కోసం ఐఐఐటీ website www.rguktn.ac.in (Nuzvid IIIT Site) లేదా www.rgukt.in లను చూడండి.
0 Response to " 10వ తరగతి పూర్తి అయ్యాక IIIT లో ప్రవేశం"
Post a Comment