ఎస్‌బిఐ ఫ్లెక్సీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అకౌంట్‌

ఎస్‌బిఐ లాంటి ప్రభుత్వరంగ బ్యాంకులలో లావాదేవీలు, భద్రతలపై భరోసా ఉంటుంది. అందులో భాగంగానే ఎస్‌బిఐ ఖాతాదారులకు వివిధ రకాల డిపాజిట్‌ స్కీంలు అందుబాటులో ఉన్నాయి. 


ఇందులో ఎస్‌బిఐ ఫ్లెక్సీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ ఒకటి. ఇది రికరింగ్‌ డిపాజిట్‌ (ఆర్డీ) లాంటిది. కాకపోతే ప్రతి నెలా ఫిక్స్‌డ్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ కాకుండా మార్చుకునే వెసులుబాటు ఉంది. మన వార్షిక మొత్తాన్ని ఆ ఏడాదిలో ఎప్పుడైనా చెల్లించే అవకాశం కల్పించారు. 


నిజానికి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. లాకిన్‌ పీరియడ్‌ పూర్తయ్యే వరకు దీనిని తీయలేం. నెల నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేందుకు రికరింగ్‌ డిపాజిట్‌ తెరవొచ్చు. నెలకు ఎంతో కొంత మొత్తం డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది


కానీ, ఈ స్కీం మనం ఎంతైనా డిపాజిట్‌ చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ ఫ్లెక్సీ డిపాజిట్‌లో ఖాతాదారులు తమకు నచ్చిన అమౌంట్‌ను ఇన్వెస్ట్‌ చేయవచ్చు. 


అయితే ఏడాదికి ఎంత డిపాజిట్‌ చేస్తామనే విషయాన్ని ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. నెలకు కనీసం 500 రూపాయలు డిపాజిట్‌ చేయాలి. ఓ ఆర్థిక సంవత్సరంలో 5,000 రూపాయలు డిపాజిట్‌ చేయాలి. 


గరిష్టంగా 
50,000 రూపాయలు డిపాజిట్‌ చేయవచ్చు. వార్షిక డిపాజిట్‌ను 10 నెలల్లో కొంత పెనాల్టీని చెల్లించి, ఎప్పుడైనా కట్టవచ్చు. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు గడువు ఎంచుకోవచ్చు. టర్మ్‌ డిపాజిట్లకు ఎంత వడ్డీ వస్తుందో ఎస్‌బిఐ ఫ్లెక్సీ డిపాజిట్‌ అకౌంట్‌పై కూడా అంతే వడ్డీ వస్తుంది. త్రైమాసికానికి చక్రవడ్డీ లెక్కిస్తారు. సీనియర్‌ సిటిజన్లకు వడ్డీ కాస్త ఎక్కువగా వస్తుంది. 


ఈ డిపాజిట్‌ స్కీంలో డబ్బు ముందుగానే విత్‌ డ్రా చేసుకోవచ్చు. అయితే అరశాతం వడ్డీ తక్కువగా వస్తుంది. ఈ స్కీంపై రుణ సదుపాయం ఉంది. మరిన్ని వివరాలకు దగ్గరలోని ఎస్‌బిఐ బ్రాంచ్‌ను సంప్రదించండి! 

- మినిమం ఇన్‌స్టాల్‌మెంట్‌ - 500 రూపాయలు. 
- ఏడాదికి కనీస డిపాజిట్‌ 5,000 రూపాయలు. 
- ఏడాదికి గరిష్ట డిపాజిట్‌ 50,000 రూపాయలు. 


- కనీసం ఐదేళ్ల కాలపరిమితి, గరిష్టంగా ఏడేళ్లు. 
- నగదును ముందుగా విత్‌ డ్రా చేసుకోవచ్చు. కానీ ఇంట్రెస్ట్‌కు అరశాతం తక్కువగా ఇస్తారు.
- నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌ చెల్లించకుంటే ఏడాదికి 50 రూపాయలు పెనాల్టీ

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎస్‌బిఐ ఫ్లెక్సీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అకౌంట్‌"

Post a Comment