మీ చిన్నారి కోసం 'సుకన్య సమృద్ధి యోజనా

మీకు చిన్న పాప ఉందా? ఆమె పేరుమీద కొంత మొత్తాన్ని పొదుపు చేయాలను కుంటున్నారా? అయితే మీరు మీ పాప కోసం సుకన్య సమృద్ధి యోజనా ఖాతాను ప్రారంభించవచ్చు. 'బేటీ బచావో, బేటీ పఢావో' ప్రచారంలో భాగంగా భారత ప్రభుత్వం 'సుకన్య సమృద్ది యోజనా' పొదుపు పథకాన్ని ఆరంభించింది.


 
అర్హతలు

- ఈ ఖాతా అమ్మాయి పేరుమీద తల్లి లేదా తండ్రి ప్రారంభించవచ్చు.

- ఖాతా ప్రారంభించే నాటికీ అమ్మాయి వయసు పదేళ్ల లోపు ఉండాలి. 
- ఒక అమ్మాయి పేరుమీద ఒకటికి మించి ఖాతాలు ప్రారంభించరాదు. 
- ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నా కూడా వారికోసం ఈ ఖాతాను తెరవ వచ్చు.



ఖాతా ప్రారంభం

- ఈ ఖాతాను పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ, ప్రయివేట్ భ్యాంకుల వద్ద ప్రారంభించవచ్చు.

- ఖాతా కోసం అమ్మాయి ఆధార్ కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్, తండ్రి లేదా తల్లి ఆధార్ కార్డు తదితర చిరునామా ధ్రువీకరణ పత్రాల అవసరం ఉంటుంది. అమ్మాయికి సంభందించిన పూర్తి వివరాలతో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
- రెండు చొప్పున పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. 
- ఒక ఆర్ధిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. కనీస మొత్తం జమచేయక పోతే కొంత జరిమానా విధిస్తారు. 
- కనీసం 15 ఏళ్ళ వరకు ఖాతాలో సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. 21 సంవత్సరాలకు ఖాతా నిలిపి వేస్తారు. అప్పుడు జమచేసిన సొమ్ముకు చక్రవడ్డీ కలిపి అందజేస్తారు. 
- అయితే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు దాటిన తర్వాత విద్యకు అవసరమయ్యే వ్యయాలకు సగం వరకు సొమ్ము తీసుకోవచ్చు. 
- 18 ఏళ్ళ తర్వాత పెళ్లి ఖర్చులకు అవసరం అనుకుంటే ఖాతాను ముందుగానే ముగించుకోవచ్చు. 
- ఈ ఖాతాను అవసరం అనుకుంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోని శాఖకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.



వడ్డీ రేటు ఎంత?

సుకన్య సమృద్ధి యోజనా ఖాతాపై వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేటును సమీక్షిస్తారు. గరిష్టంగా వడ్డీ రేటు 8.5 శాతం వరకు ఉంటుంది



పన్ను ప్రయోజనం

- ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తానికి సంబంధించి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని 80 సి కింద గరిష్టంగా వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

ఇన్ని రకాల ప్రయోజనాలు ఈ ఖాతా ద్వారా ఉన్నాయి. అందుకే వెంటనే ఈ ఖాతాని ప్రారంభించేందుకు సిద్ధం అయితే బాగుంటుందేమో... ఆలోచించండి


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మీ చిన్నారి కోసం 'సుకన్య సమృద్ధి యోజనా"

Post a Comment