ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను కేవలం ఒక పరుగు తేడాతో ఓడించిన ముంబయి ఇండియన్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది
తొలుత బ్యాటింగ్‌కు దిగి, 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసిన ముంబయి, ఆతర్వాత అంత సాధారణమైన స్కోరును కూడా రక్షించుకోగలిగింది. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ దాదాపు చివరి వరకూ క్రీజ్‌లో నిలిచి 80 పరుగులు చేసి, ఒకానొక దశలో జట్టును విజయానికి చేరువలోకి తెచ్చాడు.
కానీ, అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించిన అతను రనౌట్ కావడం చెన్నైని దారుణంగా దెబ్బతీసింది. టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్‌ను ఎంచుకుంది
టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి 150 పరుగులు లక్ష్యంగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 33 పరుగుల స్కోరువద్ద ఓపెనర్ ఫఫ్ డు ప్లెసిస్ వికెట్‌ను కోల్పోయింది. కృణాల్ పాండ్య బౌలింగ్‌లో వరుసగా ఒక ఫోర్, ఒక సిక్సర్, మరో ఫోర్ కొట్టిన డు ప్లెసిస్ తర్వాతి బంతిలోనూ భారీ షాట్ కొట్టబోయి వికెట్‌కీపర్ క్వింటన్ డి కాక్ స్టంప్ చేయడంతో ఔట్ అయ్యాడు. అతను 13 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
కాగా, బుమ్రా తన చివరి బంతిలో నాలుగు పరుగులు బైస్ రూపంలో సమర్పించుకున్నాడు. దీనితో చివరి ఓవర్లో చెన్నై 9 పరుగుల దూరంలో నిలిచింది. మలింగ వేసిన చివరి ఓవర్ మొదటి మూడు బంతుల్లో నాలుగు పరుగులు లభించాయి. నాలుగో బంతికి వాట్సన్ రనౌటయ్యాడు. అతను 59 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 80 పరుగులు సాధించాడు.
పొలార్డ్ ఆగ్రహం
ఫైనల్ పోరు, చివరి క్షణాల్లో ముంబయి ఆటగాడు కీరన్ పొలార్డ్‌కు కోపం వచ్చింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను డ్వెయిన్ బ్రేవో బౌల్ చేశాడు. అతను వేసిన మూడో బంతి స్టంప్స్ నుంచి చాలా దూరంగా వెళ్లింది. వైడ్ బాల్ అనుకున్న పొలార్డ్ దానిని విడిచిపెట్టాడు.
కానీ, అంపైర్ నితిన్ మీనన్ దానిని వైడ్‌గా ప్రకటించకపోవడంతో ఆగ్రహించిన పొలార్డ్ తన బ్యాట్‌ను గాల్లో గట్టిగా కొట్టాడు. అంతటితో ఆగకుండా, వికెట్లను వదలిపెట్టి, క్రీజ్‌కు చివరిగా నిలబడి, నిరసన వ్యక్తం చేశాడు. ఆ సమయంలో, మరో అంపైర్ ఇయాన్ గౌల్డ్‌ను సంప్రదించిన నితిన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
స్కోరుబోర్డు
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: క్వింటన్ డి కాక్ సీ మహేంద్ర సింగ్ ధోనీ బీ శార్దూల్ ఠాకూర్ 29, రోహిత్ శర్మ సీ మహేంద్ర సింగ్ ధోనీ బీ దీపక్ చాహర్ 15, సూర్యకుమార్ యాదవ్ బీ ఇమ్రాన్ తాహిర్ 15, ఇషాన్ కిషన్ సీ సురేష్ రైనా బీ ఇమ్రాన్ తాహిర్ 23, కృణాల్ పాండ్య సీ అండ్ బీ శార్దూల్ ఠాకూర్ 7, కీరన్ పొలార్డ్ 41 నాటౌట్, హార్దిక్ పాండ్య ఎల్బీ దీపక్ చాహర్ 16, రాహుల్ చాహర్ సీ ఫఫ్ డు ప్లెసిస్ బీ దీపక్ చాహర్ 0, మిచెల్ మెక్‌క్లీన్‌గన్ రనౌట్ 0, జస్ప్రీత్ బుమ్రా 0 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149.
వికెట్ల పతనం: 1-45, 2-45, 3-82, 4-89, 5-101, 6-140, 7-140, 8-141.
బౌలింగ్: దీపక్ చాహర్ 4-1-26-3, శార్దూల్ ఠాకూర్ 4-0-37-2, హర్భజన్ సింగ్ 4-0-27-0, డ్వెయిన్ బ్రేవో 3-0-24-0, ఇమ్రాన్ తాహిర్ 3-0-23-2, రవీంద్ర జడేజా 2-0-12-0.
చెన్నై సూపర్ కింగ్స్: ఫఫ్ డు ప్లెసిస్ స్టంప్డ్ క్వింటన్ డి కాక్ బీ కృణాల్ పాండ్య 26, షేన్ వాట్సన్ రనౌట్ 80, సురేష్ రైనా ఎల్బీ రాహుల్ చాహర్ 8, అంబటి రాయుడు సీ క్వింటన్ డి కాక్ బీ జస్ప్రీత్ బుమ్రా 1, మహేంద్ర సింగ్ ధోనీ రనౌట్ 2, డ్వెయిన్ బ్రేవో సీ క్వింటన్ డి కాక్ బీ జస్ప్రీత్ బుమ్రా 15, రవీంద్ర జడేజా 5 నాటౌట్, శార్దూల్ ఠాకూర్ ఎల్బీ లసిత్ మలింగ 2, ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 148.
వికెట్ల పతనం: 1-33, 2-70, 3-73, 4-82, 5-133, 6-146, 7-148.
బౌలింగ్: మిచెల్ మెక్‌క్లీనగన్ 4-0-24-0, కృణాల్ పాండ్య 3-0-39-1, లసిత్ మలింగ 4-0-49-1, జస్ప్రీత్ బుమ్రా 4-0-14-2, రాహుల్ చాహర్ 4-0-14-1, హార్దిక్ పాండ్య 1-0-3-0.
0 Response to " ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను కేవలం ఒక పరుగు తేడాతో ఓడించిన ముంబయి ఇండియన్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది"
Post a Comment