సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి ఫలితాలు
cbseresults.nic.in. ఈ ఫలితాలను చూసుకోవచ్చు.
ఈ పరీక్షల్లో 83.4% ఉత్తీర్ణత శాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి వరకు పదో తరగతి, పన్నెండో తరగతికి సీబీఎస్ఈ బోర్డు వార్షిక పరీక్షలను నిర్వహంచింది. మొత్తం 13 లక్షల మంది సీబీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలు రాశారు
. 10, 12 తరగతులకు గానూ 31,14,821మంది నమోదు చేసుకున్నారు. వీళ్లలో 28 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా 4,974 , విదేశాల్లో 78 పరీక్షా కేంద్రాలను ఇందుకోసం ఏర్పాటు చేశారు.
తొలుత మే నెల మూడో వారంలో ఫలితాలు విడుదల చేయాలని ప్రకటించినా..కొన్ని కారణాల వల్ల ముందే విడుదల చేశారు. ఇలా విద్యార్థులకు ఎటువంటి సమాచారం లేకుండా సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల చేయడం ఇదే తొలిసారి. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హన్సికా శుక్లా, అదే రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌కు చెందిన కరీష్మా అరోరా 499/500 మార్కులతో ఈ ఫలితాల్లో తొలిస్థానంలో నిలిచారు
0 Response to "సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి ఫలితాలు"
Post a Comment