వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలకు ఈ నెల 29 ( బుధవారం ) నుంచి కౌన్సిలింగ్‌

బిసి గురుకులాల కార్యదర్శి కృష్ణమోహన్‌ వెల్లడి 

మహాత్మా జ్యోతిభా ఫూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలకు ఈ నెల 29 ( బుధవారం ) నుంచి కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి కృష్ణమోహన్‌ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. 


ఎపిఆర్‌జెసి సెట్‌ 2019 ద్వారా నిర్వహించిన పరీక్షలో సాధించిన ర్యాంకులను బట్టి ప్రవేశం కల్పించడం జరుగుతుందన్నారు.


 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన బాలురుకు విశాఖ పట్నం సింహాచలం కళాశాల సీట్లకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల బాలికలకు నెల్లిమర్ల, తానం కళాశాల సీట్లకు సింహాచలంలో కౌన్సిలింగ్‌ ఉంటుందన్నారు


తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు బాలురకు మోపిదేవి కళాశాల సీట్లకు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు బాలురకు దొరవారి సత్రం, కోట సీట్లకు దొరవారి సత్రంలో కౌన్సింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 


ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు బాలికలకు టేకులోడు, గుదిబండ, నందలూరు, అరేకల్‌, నెరవాడ కళాశాలల్లోని సీట్లకు అనంతపురం, కర్నూలు బాలురకు లేపాక్షి, గుండుమల కళాశాలల్లోని సీట్లకు లేపాక్షిలో కౌన్సిలింగ్‌ ఉంటుందన్నారు.


 అన్ని ప్రాంతాల్లో 29న ఎంపిసి, 30న బైపిసి, 31న ఎంఇసి, సిఇసి గ్రూపులకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్‌ కేంద్రాల్లో మెరిట్‌ ఆధారంగా, కేటగిరీల వారీగా ఆయా కళాశాలల్లో గ్రూపులు కేటాయిస్తామన్నారు.

కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఎపిఆర్‌జెసి హాల్‌టిక్కెట్‌, ర్యాంకు పత్రం, పదో తరగతి ఉత్తీర్ణత పత్రం, ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇబిసి విద్యార్థులకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డులను తీసుకొని రావాల్సి ఉంటుందన్నారు. 

CLICK HERE TO OFFICIAL WEBSITE

కౌన్సిలింగ్‌ సమయంలో రూ.715 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉదయం 11 లోపు కౌన్సిలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. వివరాలకు www.mjpapbcwr.inవెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలకు ఈ నెల 29 ( బుధవారం ) నుంచి కౌన్సిలింగ్‌"

Post a Comment