జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన ఇంటర్మీడియట్ అభ్యర్థులకు ఇండియన్ నేవీ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. బీటెక్ విద్యను ఉచితంగా అందించడంతోపాటు సబ్ లెఫ్టినెంట్ ఉద్యోగాన్నీ ఇస్తోంది. ఎంపికైతే మంచి జీతంతోపాటు ఎన్నో రకాల అలవెన్స్‌లనూ చిన్నవయసులోనే పొందవచ్చు.
బీటెక్ విద్యను ఉచితంగా అందించడంతోపాటు సబ్ లెఫ్టినెంట్ ఉద్యోగాన్నీ ఇస్తోంది. ఎంపికైతే మంచి జీతంతోపాటు ఎన్నో రకాల అలవెన్స్‌లనూ చిన్నవయసులోనే పొందవచ్చు.
ఇం టర్మీడియట్ తర్వాత జేఈఈ రాసిన అభ్యర్థులకు ఇంజినీరింగ్ ప్రధాన లక్ష్యం.
అదీ పూర్తికాగానే ఉద్యోగం. ఇందుకోసం చాలా ఖర్చు కూడా పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ రెండింటినీ ఉచితంగా అందిస్తోంది భారత నౌకాదళం. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి ఉంటే చాలు..
కొన్ని పరీక్షలు, ఇంటర్వ్యూలు పెట్టి ఎంపిక చేసుకుంటారు. ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా అందిస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తిచేస్తే ప్రతిష్ఠాత్మక జేఎన్‌యూ నుంచి డిగ్రీ పట్టాను అందుకోవచ్చు.
ఆ తర్వాత సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఇండియన్ నేవీలో ఉద్యోగం ఇస్తారు. మొదటి నెల నుంచే దాదాపు లక్ష రూపాయలు వేతనంగా అందుతుంది. ఇతర ఎన్నో అలవెన్స్‌లూ ఉంటాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే భారతీయ నావికాదళం విడుదల చేసిన 10+2 టెక్ ఎంట్రీకి దరఖాస్తు చేసుకోవాలి
ఎవరు అర్హులు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌లో ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
వీటితోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్ -2019లో అర్హత సాధించి ఉండాలి. పురుషులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ.ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి. జులై 2, 2000 - జనవరి 1, 2003 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: జేఈఈ-2019 మెయిన్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా దరఖాస్తులను షార్ట్‌లిస్టు చేస్తారు. వీరికి సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆగస్టు - అక్టోబరు మధ్య కాలంలో బెంగళూరు, భోపాల్, కోయంబత్తూరు, విశాఖపట్నంల్లో ఏదోఒక చోట ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
మొత్తం 5 రోజుల పాటు ఇవి రెండు దశల్లో కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్-1 పరీక్షలో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్టు, పిక్చర్ పర్సెప్షన్ టెస్టు, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికి మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్-2లో ఇంటర్వ్యూలు చేస్తారు.
దీనిలో భాగంగా సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. వీటిలోనూ నెగ్గితే వైద్యపరీక్షలు నిర్వహించి తుదిదశ నియామకాలు చేపడతారు.
దరఖాస్తులు: మే 31 నుంచి జూన్ 17లోగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్:https://www.joinindiannavy.gov.in/
శిక్షణ ఇలా..
ఎం పికైనవారికి శిక్షణ తరగతులు జనవరి 2020 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమాల (కేరళ)లో బీటెక్ అప్లైడ్ ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) లేదా మెకానికల్ ఇంజినీరింగ్ (ఇంజినీరింగ్ బ్రాంచ్) లేదా ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఎలెక్ట్రికల్స్ బ్రాంచ్) కోర్సుల్లోకి తీసుకుంటారు.
చదువుతోపాటు వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫాం అన్నీ ఉచితంగా అందిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
CLICK HERE TO OFFICIAL WEBSITE
కోర్సు అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో నేవీలోకి తీసుకుంటారు. ప్రారంభంలోనే అన్నీ కలిపి గరిష్ఠంగా రూ.లక్ష వరకు వేతనం అందుతుంది. దీంతోపాటు కుటుంబానికి ఆరోగ్య బీమా, ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు, తక్కువ ధరకు క్యాంటీన్ సామగ్రి, తక్కువ వడ్డీకి గృహ, వాహన రుణాలు మొదలైనవి పొందవచ్చు.
0 Response to "జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన ఇంటర్మీడియట్ అభ్యర్థులకు ఇండియన్ నేవీ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. బీటెక్ విద్యను ఉచితంగా అందించడంతోపాటు సబ్ లెఫ్టినెంట్ ఉద్యోగాన్నీ ఇస్తోంది. ఎంపికైతే మంచి జీతంతోపాటు ఎన్నో రకాల అలవెన్స్‌లనూ చిన్నవయసులోనే పొందవచ్చు. "
Post a Comment