8న పాఠశాలల ఆన్‌లైన్‌ అకడమిక్‌ మోనటరింగ్‌

*♦8న పాఠశాలల ఆన్‌లైన్‌ అకడమిక్‌ మోనటరింగ్‌*

 *🔸పాఠశాలల పనితీరు, సందర్శనలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దిశగా పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌ అకడమిక్‌ మోనటరింగ్‌ సిస్టమ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇప్పటివరకు మాన్యు వల్‌ విధానంలో పాఠశాలల తనిఖీలు, సందర్శన వివరాలను నమోదు చేశారు. ఇక మీదట క్షేత్రస్థాయి నుంచే పాఠశాలల తనిఖీలను పర్యవేక్షించేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని అమలులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత ఈ నెల 8వ తేదీన పైలె ట్‌ ప్రాజెక్టును ♦ప్రకాశం జిల్లాలో ప్రారంభిస్తున్నారు.*

 

*🔹ఆ రోజున ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ హైస్కూళ్లు, మండలస్థాయిలో ప్రాథమికోన్నత పాఠశా లలు, ప్రాథమిక పాఠశాలల్లో కొన్నింటిని తనిఖీ చేసి ఏపీ అకడ మిక్‌ మోనటరింగ్‌ సిస్టమ్‌ మొబైల్‌ యాప్‌లో అక్కడికక్కడే నమో దు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీఈవో, ఎస్‌ఎస్‌ఏ పీవో, డీవైఈవోలు, ఎస్‌ఎస్‌ఏ ఏఎంవో, డైట్‌ ప్రిన్సిపాల్‌, జిల్లా అసెస్‌మెంట్‌ సెల్‌ సభ్యులు, డీఈవో నియమించిన ఇద్దరు ఎంఈ వోలు, మరో ఇద్దరు కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు నిర్దేశిత రోజున పాఠశా లలను సందర్శించి వివరాలను మొబైల్‌ యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.*

🍁🍃🍁🍃🍁🍃🍁🍃

CLICK HERE TO DOWNLOAD GUIDELINES

CLICK HERE TO DOWNLOAD GUIDELINES in Telugu

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "8న పాఠశాలల ఆన్‌లైన్‌ అకడమిక్‌ మోనటరింగ్‌"

Post a Comment