*పట్టభద్రుల ఓట్లు నమోదుకు మరోసారి అవకాశం!*
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ మరొక అవకాశం కల్పించింది. జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ సేవా, నెట్ సెంటర్, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయంలో ఓటు నమోదు చేసుకోవాలని కలెక్టరేట్ అధికారులు చెబుతున్నారు. నమోదుకు గెజిటెడ్ అధికారి సంతకం చేసిన డిగ్రీ నకలు, నివాస ధ్రువీకరణ ఆధారం వినియోగంలో ఉన్న సెల్ నెంబర్ ఉండాలి
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""
*ప్రియమైన పట్టభద్రుల్లారా....*
ఉభయగోదావరి మరియు క్రిష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి జరిగే ఎన్నికలకు ఓటు నమోదు చేయించుకోలేక పోయామని నిరాశ నిస్పృహలో వున్నారా? అయితే మీకు మరోసారి అవకాశం రాబోతోంది. జనవరి 1 నుండి 30 వరకు మరోసారి అవకాశం ఉంది. ఈసారైనా నిర్లక్ష్యం వదిలి బాధ్యతతో వ్యవహరించండి. *" పట్టభద్రుల ఓటు"* అంటే... మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబ సామాజిక - ఆర్థిక స్థితిగతుల గురించి చట్ట సభల్లో రాజకీయాలకు అతీతంగా పోరాడే ప్రతినిధిని పంపించే ఆయుధం అని గుర్తించండి. మోసపోకుండా స్వయంగా మీరే *మీ సేవ, నెట్ సెంటర్ లేదా యం.పి.డి.ఓ., యం.ఆర్.ఓ."* కార్యాలయాల్లో ఓటు నమోదు స్వయంగా చేసుకోండి. ఎందుకంటే *" మీ ఓటు... మీ జీవితానికి భద్రత"* గా భావించి వ్యక్తిగత శ్రద్ద తీసుకోండి.
*MLC ఓటు నమోదు ఆన్ లైన్ లో చేసుకోవాలంటే....*
1) గెజిటెడ్ అధికారి సంతకం చేసిన డిగ్రీ నకలు (200 కె.బి. లోపు జె.పి.జి. ఫార్మేట్)
2) పాస్పోర్ట్ సైజ్ ఫొటో (100 కె.బి. లోపు జె.పి.జి. ఫార్మేట్)
3) మీ సాధారణ ఓటు వివరాలు
4) ప్రస్తుత మీ నివాసం ధృవీకరించే ఆధారం.
5) వినియోగం లో వున్న మీ సెల్ నెంబర్
*ఈ క్రింది వెబ్ సైట్ లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వివరాలు ఎంటర్ చేస్తే ఓటు నమోదు అయిపోతుంది* http://ceoaperms.ap.gov.in/mlc_registration/ERO/form18.aspx
*2వ విడత పట్టభద్రుల ఓట్లు నమోదు ప్రక్రియ 2019 జనవరి 1 నుండి 30 వరకు జరుగుతుంది. ఇంతవరకు నమోదు చేయించుకోని వారు అవకాశం వినియోగించుకోండి*
0 Response to " "
Post a Comment