TaRL*TaRL బేస్ లైన్ టెస్ట్*
█► *`CVPRASAD`*◄█
█► *`APTF AMARAVATHI`*◄█
*TaRL బేస్ లైన్ టెస్ట్*
గుడ్ మార్నింగ్,
సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయ ఉత్తర్వుల మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను సెప్టెంబర్ 10వ మరియు 11వ తేదీ లలో 3వ, 4వ మరియు 5వ తరగతి చదువుతున్న పిల్లలకు TaRL (Teaching at Right Level) కార్యక్రమం అమలులో భాగంగా బేస్ లైన్ పరీక్ష నిర్వహించాలి. ఇందు వెంట పరీక్ష నిర్వహించడానికి అవసరమైన సూచనలు మరియు ప్రశ్నపత్రాలు (Testing Tools) పంపడం జరిగింది. మండల విద్యాధికారులు మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (3,4,5 తరగతులు కలిగియున్నవారు) సంబందిత ఉపాద్యాయులకు బేస్ లైన్ పరీక్ష నిర్వహించడా నికి తగిన సూచనలు ఇచ్చి పూర్తి చేయించాల్సిందిగా విజ్ఞప్తి. త్వరలో బేస్ లైన్ టెస్ట్ ఫలితాలను ఆన్ లైన్ చేయడానికి లింక్ పంపబడుతుంది. అంతలోపు రికార్డ్స్ లో ఎంటర్ చేసి సిద్దంగా ఉంచుకోవాలి.
*ముఖ్య గమనిక*: గత విద్యా సంవత్సరం ఆన్ లైన్ లో ఎంటర్ చేసిన TaRL ఫలితాలను బట్టి చూస్తే చాలా పాఠశాలల్లో బేస్ లైన్ పరీక్షలో విద్యార్థుల స్థాయి కంటే ఎండ్ లైన్ పరీక్ష లో విద్యార్థుల స్థాయి తక్కువగా ఉంది. అంటే బేస్ లైన్ పరీక్ష నాటికి విద్యార్థి కి వస్తున్న చదువు (కథా స్థాయి లేదా పేరా స్థాయి) కంటే మన దగ్గర సంవత్సరమంతా చదువుకున్న తర్వాత నిర్వహించే ఎండ్ లైన్ పరీక్ష నాటికి వచ్చిన చదువు (పదాల స్థాయి లేదా అక్షర స్థాయి) తక్కువ గా ఉంది. బేస్ లైన్ నుండి ఎండ్ లైన్ కు విద్యార్థి స్థాయి పెరగాలి లేదా కనీసం అదే స్థాయిలో అయినా ఉండాలి. *విద్యార్థుల స్థాయి తగ్గిపోతే
బాధ్యులెవరు?* రికార్డ్స్ మరియు ఆన్లైన్ లో డేటా ఎంటర్ చేసేటప్పుడు తప్పులు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది.
-DEO & APC, Anantapuramu.
0 Response to "TaRL*TaRL బేస్ లైన్ టెస్ట్* "
Post a Comment