*డిజిటల్ విద్య మితిమీరితే ప్రతికూలమే- ఐక్యరాజ్యసమితి"
దిల్లీ: పాఠశాల స్థాయిలో సాంకేతికతను
అందిపుచ్చుకోవడం సానుకూల అంశమే.
అయినప్పటికీ దాన్ని మితిమీరిన రీతిలో
వినియోగించడం ప్రమాదకర పరిణామమేనని
అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్న విషయం
తెలిసిందే. మొబైల్ డివైజ్‌లతో ఎక్కువ సమయం
గడపడం విద్యార్థి దృష్టి మరల్పుతుందని, వారి
అభ్యసన పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తాజా
నివేదిక వెల్లడించింది.
టెక్నాలజీ పైనే తీవ్ర దృష్టి పెట్టడమనేది భారీ
మూల్యం చెల్లించుకోవడమేనని, అభ్యసన ప్రక్రియకు
అసరమైనప్పుడు మాత్రమే దాన్ని తరగతుల్లో
ఉపయోగించాలని ఐక్యరాజ్యసమితి నివేదిక
పేర్కొంది. ఈ క్రమంలోనే దాదాపు 14 దేశాలు
పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగాన్ని
నిషేధించాయని తెలిపింది. 'విద్యలో సాంకేతికతి
అనే అంశానికి సంబంధించి యునెస్కో తాజా
నివేదికలో పలు విషయాలు వెల్లడించింది
“మితిమీరిన సాంకేతికత వినియోగం, విద్యార్థుల
పనితీరు మధ్య ప్రతికూల సంబంధాన్ని
చూపిస్తుందని ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్
స్టూడెంట్ అసెస్‌మెంట్ (PISA) విశ్లేషణలో తేలింది.
మొబైల్ డివైజ్‌లతో ఎక్కువ సమయం గడపడం
వల్ల అభ్యసన ప్రక్రియలో ప్రతికూల ప్రభావాలు
వచ్చినట్లు అనేక దేశాల నివేదికలు
పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో పాఠశాలల్లో
స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై ఇప్పటికే 14 దేశాలు
నిషేధం విధించాయి” అని తాజా నివేదిక పేర్కొంది.
తరగతి గది, ఇంట్లో చిన్నారుల చదువులపై
స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు తీవ్ర అంతరాయం
కలిగిస్తాయని యునెస్కో అప్రమత్తం చేసింది
“డిజిటల్ టెక్నాలజీని అలవరచుకోవడం వల్ల విద్య,
అభ్యసన ప్రక్రియలో ఎన్నో మార్పులు వచ్చాయి.
ప్రాథమిక నైపుణ్యాలను నేర్పే క్రమంలో అనేక
సంపన్న దేశాలు డిజిటల్ సాంకేతికతను విసృతంగా
వినియోగిస్తున్నాయి. "పేపర్ స్థానంలో స్క్రీన్లు,
పెన్నుల స్థానంలో కీబోర్డులు వచ్చేశాయి.
కొవిడ్-19తో రాత్రికి రాత్ర విద్యావ్యవస్థలు
ఆన్‌లైన్‌లోకి మారిపోయాయి” అని ఐరాస విద్యా
బృందానికి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు
0 Response to "*డిజిటల్ విద్య మితిమీరితే ప్రతికూలమే- ఐక్యరాజ్యసమితి""
Post a Comment