పాఠశాల పని వేళల్లో మార్పులు విద్యాశాఖ ఉత్తర్వులు (తెలంగాణ)

"హైదరాబాద్‌: తెలంగాణలో పాఠశాలల వేళలను

మారుస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ

చేసింది. ప్రాథమిక పాఠశాలల సమయాలకు

అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో

మార్పు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉన్నత పాఠశాల

సమయాలను ఉదయం 9.30 నుంచి  9 గంటలకు

మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం

4.45 బదులుగా 4.15 గంటలకు పని వేళలు 

ముగుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌,

సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో

ఉంచుకుని ప్రస్తుతం అమలులోఉ న్న పని వేళలు

కొనసాగుతాయని పేర్కొంది. జంట నగరాల్లో

ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4గంటల వరకు







కొనసాగనున్నాయి. ఈమేరకు చర్యలు తీసుకోవాలని





పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాల పని వేళల్లో మార్పులు విద్యాశాఖ ఉత్తర్వులు (తెలంగాణ)"

Post a Comment