సెక్షన్ 80c పరమతి ఈసారైనా పెరిగేనా? చివరిసారి ఎప్పుడు పెంచారు

ఇంటర్నట్‌ డెస్క్‌: ఆదాయపు పన్ను

చెల్లింపుదారులకు సెక్షన్‌ 80సి

గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బడ్జెట్‌ వచ్చిన

(Budjet 2024) ప్రతిసారీ వేతన జీవులు ఆశగా

ఎదురుచూసే వాటిలో శ్లాబుల సవరణ ఒకటైతే...

రెండోది సెక్షన్‌ 80సి. కేంద్రం పూర్తి స్థాయి

బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో

మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ సారైనా

80సి పరిమితి 'పెంచుతారా? అని మధ్యతరగతి

ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.



ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్‌ 80సి కింద

రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు

పొందొచ్చు. వ్యక్తిగత ఆదాయపు పన్ను భారాన్ని

తగ్గించుకోవడానికి ఈ మినహాయింపును చాలా మంది

వినియోగించుకుంటూ ఉంటారు. పాత పన్ను

విధానంలో మాత్రమే ఈ సెక్షన్‌ కింద మినహాయింపులు

పొందొచ్చు. అయితే, చివరిసారిగా 2014లో సెక్షన్‌ 80సి

పరిమితిని సవరించారు. మోదీ ప్రభుత్వం తొలిసారి

అధికారంలోకి వచ్చాక నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ

రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచారు. 10

ఏళ్లుగా ఆ మొత్తాన్ని సవరించలేదు. దశాబ్దం

పూర్తయిన సందర్భంగా ఈసారైనా పరిమితిని

'పెంచుతారా? అని వేతన జీవులు ఆశగా

ఎదురుచూస్తున్నారు.


ఎందుకు ముఖ్యం..?


గృహ రుణాలు, జీవిత బీమా పాలసీలతో పాటు

పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, నేషనల్‌

పెన్షన్‌ స్కీమ్‌, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌,

బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చేసే 5 ఏళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్టు,

ఈఎల్‌ఎస్‌ఎస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ఈ

సెక్షన్‌ పరిధిలోకి వస్తాయి. ఒకవేళ పెట్టబడుల

పరిమితి రూ.1.50 లక్షలు దాటినా రూ.1.5 లక్షల

వరకే మినహాయింపులకు అనుమతిస్తారు. ఏడాదిలో

ఒక వ్యక్తికి అందే మొత్తం సూల ఆదాయంలో సెక్షన్‌

80సిని మినహాయించాక పన్ను పరిధిలోకి వచ్చే

ఆదాయాన్ని లెక్కిస్తారు. అయితే, ఈ పదేళ్లలో వ్యక్తుల

ఆదాయాలు భారీగా పెరిగాయి. ఆ మేర పరిమితి

పెరగాలని వేతన జీవులు కోరుకుంటున్నారు. ఈ

పరిమితి పెరిగితే పన్ను భారం తగ్గి. ఆ మేర పొదుపు





"పెంచుకోవడానికి వీలు పడుతుంది. అందుకే ఈ

పరిమితిని పెంచాలని పలువురు కోరుతున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సెక్షన్ 80c పరమతి ఈసారైనా పెరిగేనా? చివరిసారి ఎప్పుడు పెంచారు"

Post a Comment