ఉద్యోగులకు ప్రతి ఒక్కటీ మంచే చేస్తున్నాం: Jagan






సత్యసాయి : కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే అల్లర్లు చేశారని.. దళిత, బీసీ నేతల ఇళ్లపై దాడులు చేయడం సబబేనా?అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) ప్రశ్నించారు. నేడు శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగిన సభలో ఆయన


 మాట్లాడుతూ.. వైసీపీ(YCP) పాలనలో సామాజిక న్యాయానికి అర్ధం చెప్పామన్నారు. ఉద్యోగులను తాము కలుపుకుని పోతుంటే... వారిని కూడా రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఉద్యోగులకు ప్రతి ఒక్కటీ మంచే చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా... వైసీపీ



 ఎదుర్కొంటుందన్నారు. కోనసీమలో రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. మీరు పెట్టిన బకాయిలను తాము తీర్చినందుకా? లేదంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకా? అని నిలదీశారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలవాలంటే.. వారికి మంచి విద్యను అందించాలని సీఎం జగన్ కోరారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్యోగులకు ప్రతి ఒక్కటీ మంచే చేస్తున్నాం: Jagan"

Post a Comment