వెంటనే డీఏ బకాయిలు ఇవ్వండి:

అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): జనవరి డీఏ, డీఏ బకాయిలపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని,


వెంటనే విడుదల చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 2018 జూలై 1 నుంచి 2019 జనవరి 1 వరకు డీఏ ఎరియర్స్‌ ఇప్పటికీ సీపీఎస్‌, ఓపీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. 2019 జూలై 1కి సంబంధించిన డీఏ ఎరియర్స్‌ చెల్లించాలని జీవో ఇచ్చి రద్దు చేశారన్నారు. కరోనా సమయంలో కేంద్రం ఫ్రీజ్‌ చేసిన 3 డీఏలు ఎరియర్స్‌తో సహా చెల్లించిందని, కానీ రాష్ట్రం ఇంతవరకు ఆదేశాలు ఇవ్వలేదన్నారు.



2021 జూలై 1 డీఏ ప్రకటించినా ఎరియర్స్‌ చెల్లింపుల విషయంలో ప్రభు త్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు.


శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఉద్యోగుల డీఏల బకాయిల చెల్లింపులపై నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగులు ఎదురు చూశారని, అయితే ఎలాంటి నిర్ణయం వెలువడలేదన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వెంటనే డీఏ బకాయిలు ఇవ్వండి:"

Post a Comment