✍️పాఠశాలల్లో 'బైజూస్'* *బోధన✍️📚* *♦️ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం* *♦️ప్రతి తరగతి గదిలో టివి* *♦️విద్యాశాఖ సమీక్షలో సిఎం జగన్

*📚*

*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :* ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై 'బైజూస్' యాప్ బోధనలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒప్పందం చేసుకుంది. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌కుమార్‌, బైజూస్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సుష్మిత్‌ సర్కార్‌ అవగాహనా ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ బైజూస్‌ లెర్నింగ్‌యాప్‌లో బోధన అత్యంత నాణ్యంగా ఉంటుందని చెప్పారు. నాణ్యమైన కంటెంట్‌ పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బైజూస్‌ విజువలైజేషన్‌తో తీర్చిదిద్దిందని అన్నారు. ఈ ఒప్పందం కారణంగా 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2025లో సిబిఎస్‌ఇ నమూనాలో ఇంగ్లీష్‌లో పరీక్షలు రాస్తారని తెలిపారు. వీరికి సిలబస్‌తో పాటు అదనంగా ఇంగ్లీష్‌ లెర్నింగ్‌ యాప్‌ నేర్చుకునేందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ట్యాబ్‌లను అందిస్తామని చెప్పారు. డిజిటల్‌ పద్ధతుల్లో నేర్చుకునే విధానం, అభ్యసనం అన్ని కూడా పిల్లలకు అందుబాటులో వస్తాయని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి బైజూస్‌ కంటెంట్‌ను పొందుపరిచి పాఠ్యపుస్తకాలను ముద్రిస్తామని తెలిపారు. వీడియో కంటెంట్‌ ద్వారా పిల్లలు నేర్చుకునేందుకు నాడు-నేడు కింద ప్రతి తరగతి గదిలో టివిలు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి బైజూస్‌ కంటెంట్‌ అంతా ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. విజువల్‌ ప్రెజెంటేషన్లను కూడా పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతి తరగతి గదిలో కూడా టివిని పెట్టాలని ఆదేశించారు. నాడు-నేడు కింద టివిలను గదుల్లో ఏర్పాటు చేయాలని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఇవనీు చేయాలని ఆదేశించారు. టీచర్లకు కూడా శిక్షణ అందుతుందని, వారు నిరంతరం అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.

*♦️'టెన్త్‌' సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైతే 'రెగ్యులర్‌'*

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను రెగ్యులర్‌గానే పరిగణిస్తామని సిఎం జగన్‌ అన్నారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తక్కువ రావడంపై తప్పుగా భావించనక్కరలేదన్నారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని చెప్పారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యాకానుక కిట్లు అందించాలని ఆదేశించారు. స్కూళ్లల్లో వాచ్‌మెన్‌ నియామకంపై ఆలోచన చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బత్స సత్యనారాయణ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనరు టి విజయకుమార్‌ రెడ్డి, ఎస్‌ఎస్‌ఎ డైరెక్టర్‌ వెట్రిసెల్వి పాల్గొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "✍️పాఠశాలల్లో 'బైజూస్'* *బోధన✍️📚* *♦️ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం* *♦️ప్రతి తరగతి గదిలో టివి* *♦️విద్యాశాఖ సమీక్షలో సిఎం జగన్"

Post a Comment