Whatsapp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ ఇదే - గ్రూప్ అడ్మిన్స్‌కు గుడ్ న్యూస్, మెంబర్స్‌కు బ్యాడ్ న్యూస్ - ఎందుకంటే?






వాట్సాప్‌లో త్వరలో ఒక కొత్త ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది. మెటా దీనిపై ఎప్పట్నుంచో పని చేస్తుంది. ఈ ఫీచర్ వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు మరిన్ని అధికారాలు ఇవ్వనుంది.

వారికి గ్రూపుపై మరింత కంట్రోల్ వస్తుంది. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ వెర్షన్ 2.22.11.4లో రానుంది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాంలో దీన్ని ఇప్పటికే విడుదల చేశారు.

వాట్సాప్ అప్‌డేట్ ట్రాకర్ WABetainfo ఈ విషయాలను మొదట బయటపెట్టింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే... గ్రూపులోని సభ్యులు పెట్టిన మెసేజ్‌లను కూడా అడ్మిన్స్ డిలీట్ చేయవచ్చు. ఆ మెసేజ్ ఉన్న ప్రదేశంలో 'This was Removed By Admin' అని కనిపించనుంది. ఇది గ్రూపుపై అడ్మిన్స్‌కు మరింత కంట్రోల్ ఇవ్వనుంది.

యూజర్‌ ఎక్స్పీరియన్స్ ను మరింత సులభం చేయడానికి వాట్సాప్ కృషి చేస్తోంది. WhatsApp బీటా ట్రాకర్ ప్రకారం, ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో వినియోగదారుల కోసం స్టేటస్ అప్‌డేట్‌లపై క్విక్ హార్ట్ ఎమోజి చూసినట్లుగానే, వాట్సాప్ కూడా సిమిలర్‌ ఫీచర్ రాబోతుంది.

త్వరలో రానున్న ఈ ఫీచర్ వాట్సాప్‌కు మరింత ప్లస్ కానుంది. దీంతో పాటు మెసేజ్ డిలీట్ చేసే టైమ్‌ని కూడా వాట్సాప్ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టైమ్ గంటన్నర వరకు ఉంది. త్వరలో ఈ టైమ్‌ను 2 రోజుల 12 గంటలకు పెంచుతారని తెలుస్తోంది. దీంతో పాటు మెసేజ్ రియాక్షన్స్ కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Whatsapp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ ఇదే - గ్రూప్ అడ్మిన్స్‌కు గుడ్ న్యూస్, మెంబర్స్‌కు బ్యాడ్ న్యూస్ - ఎందుకంటే?"

Post a Comment