ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా ఆర్థిక భరోసాను సాధించు
ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా ఆర్థిక భరోసాను సాధించుకోవచ్చు. పన్ను ప్రణాళిక అంటే ఏడాదికోసారి లేదా ఆర్థిక సంవత్సరాంతంలో చేసేది కాదు. ఈ ప్లానింగ్‌ను ఏడాది ప్రారంభంలోనే మొదలు పెట్టాలి.
సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు పొదుపు చేసేందుకు ఇన్సూరెన్స్, యులిప్‌లు తప్ప మరొకటి గుర్తుకురాదు. చాలా సందర్భాలలో ట్యాక్స్ సేవింగ్స్ కోసం వీటిలోనే ఎక్కువగా పొదుపు చేస్తారు. అయితే ఈఎల్‌ఎస్‌ఎస్ వంటి అనేక ఇతర ఆర్థిక సాధనాలు కూడా ట్యాక్స్ సేవింగ్స్‌కు సరైనవే.
ఇదీ ప్లానింగ్‌లో భాగమే
సంపద సృష్టికి మీ పొదుపు సొమ్ము దోహదపడాలనుకుంటే ట్యాక్స్ ప్లానింగ్‌ను ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో భాగంగానే చూడాలి. ఈక్విటీ, రుణ సాధనాలు, ఇతర ట్యాక్స్ సేవింగ్స్ సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఇక ఇప్పటికే మీ పోర్టుఫోలియో ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాల్లో మదుపు చేసి ఉంటే, నేషనల్ సేవింగ్స్ స్కీమ్‌కు బదులు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లో మదుపు చేయడం ఉత్తమం. దీర్ఘకాల సేవింగ్స్ కోసం పీపీఎఫ్‌లోనూ, ఎస్‌ఐపీ ద్వారా ఈఎల్‌ఎస్‌ఎస్‌లోనూ మదుపు చేయవచ్చు.
బీమాను అలా చూడవద్దు
ట్యాక్స్ సేవింగ్స్ అంటేనే అందరికీ గుర్తుకువచ్చేది బీమా. నిజానికి బీమా ప్రయోజనాల్లో పన్ను ఆదా కూడా ఒకటి అంతే. ఇన్సూరెన్స్ అంటే కుటుంబ ఆర్థిక భద్రత. ఇన్వెస్ట్‌మెంట్ అంటే సంపద సృష్టి. ట్యాక్స్ సేవింగ్ ప్లానింగ్‌లో ఈ రెండూ సమపాళ్లలో ఉండాలి. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో భాగంగా ట్యాక్స్ ప్లానింగ్ జరిగితే అందుకు తగ్గట్టు పొదుపు, మదుపు నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగానీ ట్యాక్స్ సేవింగ్స్ కోసమే బీమాను కొనుగోలు చేయరాదు. అలాగే ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్ కలిసి ఉన్న ఉత్పత్తుల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం
0 Response to "ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా ఆర్థిక భరోసాను సాధించు"
Post a Comment