పాఠశాల ప్రగతి పట్టదా!✍️📚* *♦యూడైస్‌ ప్లస్‌లో వివరాల నమోదుకు మీనమేషాలు

*📚✍️*

*🌻ఈనాడు, అమరావతి*
పాఠశాలల్లో విద్యాబివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించడానికి పిల్లలు, ఉపాధ్యాయులతో కూడిన సమాచారాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలు పంపలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం సోమవారం నాటికి ఆ సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పాలనాధికారులను ఆదేశించింది. ఆదివారం స్కూళ్లకు సెలవు అయినా ఆ సమాచారం పంపే పనిలో బిజీగా గడిపాయి. బడ్జెట్‌ కేటాయింపులు మొదలుకుని ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల నిర్వహణ వరకు ఈ సమాచారం ప్రభుత్వానికి ఒక దిక్సూచిలా ఉంటుంది. కీలకమైన ఈ సమాచారాన్ని పంపడంలో ఇప్పటివరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి మండల, జల్లా స్థాయి అధికారులు సేకరించి రాష్ట్ర స్థాయిలో కమిషనరేట్‌ కార్యాలయానికి అప్లోడ్‌ చేసేవారు. ఇన్ని స్థాయిల్లో సమాచార సేకరణ జరగడంతో తప్పిదాలు చోటుచేసుకోవటం, పక్కా సమాచారం లోపిస్తోందని భావించిన ప్రభుత్వం నేరుగా పాఠశాల ప్రదానోపాధ్యాయులే యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌ (యూడైస్‌) సైట్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా గతంలో ఉన్న యూడైస్‌ సైట్‌కు కొన్ని మార్పు, చేర్పులు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. పాఠశాలల నుంచి వచ్చే సమాచారాన్ని కచ్చితమైనదిగా ధ్రువీకరించుకుంటామని ఇటీవల పాఠశాల డైరెక్టరేట్‌ కార్యాలయానికి చెందిన ఐటీ విభాగం అధికారులు జిల్లాలకు వచ్చి కొత్తగా వచ్చిన యూ-డైస్‌ ప్లస్‌ సైట్‌లో ఆ సమాచారం ఎలా అప్లోడ్‌ చేయాలో అవగాహన కల్పించారు. అయినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం నాటికి 614 పాఠశాలలు అసలు ఆ సమాచారం ఆన్‌లైన్‌ చేయడమే ప్రారంభించలేదని గుర్తించారు.
ఉమ్మడి గుంటూరులో పాఠశాలలు 5099 (అన్ని యాజమాన్యాల్లో కలిపి)
యూడైస్‌ సమాచారం పూర్తయిన స్కూళ్లు 1974
వాటి శాతం 38.71%

పురోగతిలో ఉన్నవి: 2511
వాటి శాతం 49.24%
వివరాల నమోదు ప్రారంభించని స్కూళ్లు: 614
వాటి శాతం 12.04%

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాల ప్రగతి పట్టదా!✍️📚* *♦యూడైస్‌ ప్లస్‌లో వివరాల నమోదుకు మీనమేషాలు"

Post a Comment