ప్లే స్కూళ్ళు గా అంగనవాడీలు.. 3,4,5 తరగతులు విలీనం 1కి.మీ పరిథి లోనే... విద్యామంత్రి ప్రకటన






మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాథమిక విద్యకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్లగా మార్పుస్తున్నామని వెల్లడించారు


మిగతా అంశాలను కూడా ప్రస్తావించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ మెరుగైన విద్య అందజేస్తామని తెలిపారు. వృత్తి విద్య కోర్సలకు ప్రయారిటీ ఇస్తున్నామని తెలిపారు.

ఒకటి, రెండు తరగతిలను కలిపి ఒక యూనిట్‌గా మార్పు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఫౌండేషన్‌ కోర్సును తీసుకువస్తున్నామని వివరించారు. దీంతో పౌండేషన్ గట్టిగా ఉంటుందని చెప్పారు. 3 నుంచి 10వ తరగతి వరకు ఒక యూనిట్‌గా పరిగణిస్తామని.. ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తున్నామని తెలిపారు. దీంతో పిల్లలపై ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. స్లో లర్నర్స్‌పై దృష్టిసారించే అవకాశం ఉంటుందని చెప్పారు.

పాఠశాలల పరిధి మూడు కిలో మీటరు నుంచి ఒక కిలో మీటరు వరకు కుదించామని తెలిపారు. దీంతో డ్రాఫవుట్స్ మరింత తగ్గుతాయని చెప్పారు. అవసరమైన చోట జూనియర్‌ కళాశాలలను డిగ్రీ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని వివరించారు. దీంతో ఉన్నత విద్య అందరికీ చేరువ అదుతుందని తెలిపారు. కొత్తగా కళాశాలలు ఇవ్వబోమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉన్న కాలేజీలు అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. అన్నీ కోర్సులకు ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్లే స్కూళ్ళు గా అంగనవాడీలు.. 3,4,5 తరగతులు విలీనం 1కి.మీ పరిథి లోనే... విద్యామంత్రి ప్రకటన"

Post a Comment