ఆంధ్రప్రదేశ్ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా
అమరావతి: ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుందని మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలన్నీ కలిపి పోలవరం కేంద్రంగా కొత్త జిల్లా కానుందని,
26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశముందన్నారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయని, మరో గిరిజన జిల్లా ఏర్పాటుపై సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారన్నారు. పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాలు
కలిపి 27వ జిల్లా అవుతుందని, పోలవరం ప్రాజెక్టుకు సమీపంలో రెండు నియోజకవర్గాలను కలిపి బ్రిడ్జి నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని మంత్రి పేర్నినాని తెలిపారు.
0 Response to "ఆంధ్రప్రదేశ్ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా"
Post a Comment