పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌లోనే! షెడ్యూల్‌ మార్చే యోచనలో విద్యాశాఖ





అమరావతి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్స్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ మార్పులతో పదో తరగతి పరీక్షలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో టెన్త్‌ పరీక్షలను ఏప్రిల్‌ చివరిలోనే నిర్వహించాలని విద్యాశాఖ ఆలోచిస్తున్నట్లు సమాచారం



. జేఈఈ మెయిన్స్‌ షెడ్యూల్‌ మళ్లీ మారడంతో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను కూడా మార్చాల్సి వచ్చింది. మే 6 నుంచి ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఆయా పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబు, ప్రాథమిక విద్య కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ మధ్య చర్చ జరిగింది. 


ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు ఒకే తేదీల్లో లేకుండా పెట్టే అంశంపై వారు చర్చించారు. టెన్త్‌ పరీక్షల్ని ఇప్పటికే ప్రకటించినట్లు మేలో కాకుండా ఏప్రిల్‌ నెలాఖరులో ప్రారంభించి మే మొదటి వారానికల్లా పూర్తిచేయనున్నట్టు తెలిసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌లోనే! షెడ్యూల్‌ మార్చే యోచనలో విద్యాశాఖ"

Post a Comment