బయోమెట్రిక్ అప్డేట్* *చేయకుంటే ఆధార్ నిలిపివేత✍📚* *♦వచ్చే జనవరి నుంచి కొత్త నిబంధన*

*📚✍
*🌻మార్చి 7(ఆంధ్రజ్యోతి):* ఆధార్లో బయోమెట్రిక్ సమాచా రాన్ని సకాలంలో అప్డేట్ చేయకుంటే ఆధార్ సంఖ్యను నిలుపుదల చేయా లని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆధార్ నిబంధనలను సవ రించింది. కొత్త నిబంధనల ప్రకారం 5, 15 సంవత్సరాల వయసు దాటిన వారు గరిష్టంగా రెండేళ్లలోపు బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సి ఉండదు. అయితే రెండేళ్లలోపు అప్డేట్ చేయకుంటే ఆధార్ నెంబర్ను నిలిపివేస్తారు. తర్వాత ఆధార్ పునఃప్రారంభానికి అవసరమైన చార్జీలను వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది. రెండేళ్లలోపు అప్డేట్ చేయని ఆధార్ కార్డుదారుల పేర్లను సమాచారం నిమిత్తం వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని యూఐడీ ఏఐ సీఈవో సౌరబ్ గార్డ్ తెలిపారు

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బయోమెట్రిక్ అప్డేట్* *చేయకుంటే ఆధార్ నిలిపివేత✍📚* *♦వచ్చే జనవరి నుంచి కొత్త నిబంధన*"

Post a Comment