PRC: నేటి నుంచి పీఆర్సీపై ఉపాధ్యాయుల సంతకాల సేకరణ



PRC: పీఆర్సీ ఐక్య వేదిక ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం సీఎం జగన్‌కు వినతిని అందజేయాలనుకున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల వేదికతో ఫిట్‌మెంట్‌పై ముఖ్యమంత్రితో చర్చించాలని వినతి ఇచ్చేందుకు సీఎం కార్యాలయానికి వెళ్లారు

ఈ క్రమంలో వినతిని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇవ్వాలని సీఎంవో సూచించింది.


సజ్జల అందుబాటులో లేనందున వినతిపత్రాన్ని మంగళవారం ఇవ్వనున్నట్లు సుధీర్‌బాబు తెలిపారు.


ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు కార్యాచరణ నోటీసు ఇచ్చేందుకు ప్రతినిధుల బృందం ప్రయత్నించింది. ఆయన అందుబాటులో లేకపోవడంతో అతణ్ని కలిసేందుకు సమయం ఇవ్వాలని అధికారులకు విన్నవించినట్లు పేర్కొన్నారు.




మెరుగైన పీఆర్సీ కోసం ఐక్య వేదిక ఆధ్వర్యంలో మార్చి 8వరకు కార్యాచరణ ప్రకటించారు. అందులో భాగంగానే మంగళవారం నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీపై పునఃసమీక్షించాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టనున్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "PRC: నేటి నుంచి పీఆర్సీపై ఉపాధ్యాయుల సంతకాల సేకరణ"

Post a Comment