AP: రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ
అమరావతి: పకృతి వైపరీత్యంవల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. మంగళవారం రైతుల ఖాతాల్లో సర్కార్ ఇన్పుట్ సబ్సిడీ నిధులను జమ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.17 లక్షల మంది రైతులకు రూ.534.77 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రైతు గ్రూపులకు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు.
2014 నుంచి 2016 వరకు అప్పటి ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని సీఎం జగన్ అన్నారు. రైతులకు వందల కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్నా ఎగ్గొట్టారన్నారు. 2016లో ఇవ్వాల్సిన సబ్సిడీని 2017లో ఇచ్చారని, గత ప్రభుత్వంలో ఏనాడూ సమయానికి పరిహారం ఇవ్వలేదని, కౌలు రైతుల్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఈ క్రాప్ డేటా ఆర్బీకే స్థాయిలో అమలు చేస్తున్నామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు
Kadapa district pendlimarri mandal benipitione list
ReplyDelete