కేంద్ర ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్ హాజరు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఒమైక్రాన్ కారణంగా సంభవించిన కొవిడ్ థర్డ్‌వేవ్ సద్దుమణగడంతో కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును పునరుద్ధరించింది.
ఇంటి నుంచి పని వెసులుబాటును ఎత్తివేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలిచ్చింది.
అయితే, కొవిడ్ నిబంధనలను మాత్రం కచ్చితంగా పాటించాలని సూచించింది. దేశంలో బుధవారం 30,757 మందికి వైరస్ నిర్ధారణ అయింది.
541 మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 3.32 లక్షలకు తగ్గాయి.
0 Response to " కేంద్ర ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్ హాజరు"
Post a Comment