కొత్త డీజీపీ కడప జిల్లావాసి




రాజుపాళెం, ఫిబ్రవరి 15: రాష్ట్ర డీజీపీగా కొత్తగా నియామకం అయిన కసిరెడి ్డ రాజేంద్రనాథరెడ్డి మన జిల్లా వ్యక్తే. వీరి స్వస్థలం రాజుపాళెం మండలం పర్లపాడు గ్రామం.

ఈయన తండ్రి కశిరెడ్డి వెంకటపతిరెడ్డి మైదుకూరు ఉన్నత పాఠశాలలో తెలుగుపండిట్‌గా పనిచేశారు. పదోన్నతిపై తెలుగు జూనియర్‌ లెక్చరల్‌గా పనిచేస్తూ రిటైర్‌ అయ్యారు.

అనంతరం హైదరాబాదులో స్థిరపడ్డారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెంకటపతిరెడ్డికి రెండవ కుమారుడు. ఒక అన్న, ఒక అక్క ఉన్నారు.


1981లో కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా గొరిగెనహల్లి ఏపీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశారు. ఇంటర్‌ కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో పూర్తి చేశారు.

బీటెక్‌ చదివిన ఈయన ఉద్యోగం చేస్తూ 1992లో ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విజయవాడ పీసీగా పనిచేశారు. పోలీస్‌ హౌసింగ్‌బోర్డు మెంబర్‌గా పనిచేశారు.

కాగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జిల్లా వాసి. సీఎం తర్వాత అత్యంత కీలమైన రెండు పదవులు చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ. ఇటువంటి అత్యంత కీలకమైన ఒక పోస్టులో కడప జిల్లావాసి నియామకం కావడం విశేషం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కొత్త డీజీపీ కడప జిల్లావాసి"

Post a Comment