కూలీగా మారిన టీచర్‌








పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేసేందుక

పీలేరు, ఫిబ్రవరి 12: పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాఽధ్యాయుడు.. పీఆర్సీ నష్టా న్ని భర్తీచేసేందుకు కూలీగా మారాడు. పని దినాల్లో స్కూలుకు వెళ్తూనే, సెలవు రోజుల్లో కూలిపనులు చేస్తున్నాడు. శనివారం సెలవు కావడంతో ఒక ఇంటి స్లాబ్‌ తొలగింపు పనికి వెళ్లాడు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం ముడుపులవేముల జడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు దండు అమరనాథ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం 23శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడంతో తనకు రూ.7వేలు కోత పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన పీఆర్సీ వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పీలేరులో ఇంటి పాత స్లాబ్‌ తొలగింపు పని చేయడానికి రూ.2 వేలకు ఒప్పుకున్నానని, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేశానని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా పీఆర్సీ విషయంలో పునఃపరిశీలన చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కూలీగా మారిన టీచర్‌"

Post a Comment