మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం...తెలుగు బోధనకు మొగ్గు
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలుగు ప్రజలకు శుభవార్త అందించింది. మధ్యప్రదేశ్ పాఠశాలల్లో తెలుగు భాష వినపడనుంది. మధ్యప్రదేశ్ ప్రజల్లో అత్యధిక మంది హిందీ మాట్లాడతారన్న విషయం తెలిసిందే.
పాఠశాలల్లో తెలుగు కూడా బోధించనున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న ప్రపంచ మాతృభాషా దినోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ విద్యా శాఖ.. పాఠశాలల్లో విద్యార్థులకు హిందీ, ఆంగ్లంతో పాటు తెలుగు బోధించాలని నిర్ణయించింది. మధ్యప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా ఇతర రాష్ట్రాల భాషలను విద్యార్థులకు బోధించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయించినట్లు విద్యా శాఖ తెలిపింది. మొదట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తెలుగు భాషను బోధించనున్నారు
0 Response to "మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం...తెలుగు బోధనకు మొగ్గు"
Post a Comment