యూనిఫాం మాకు మాత్రమే ఎందుకు?
అమరావతి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంలో ఏ ఇతర ఉద్యోగులకు లేని యూనిఫాం తమకే ఎందుకంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో, వార్డుల్లో యూనిఫాం వేసుకున్న సిబ్బంది, పథకాలందని వారికి టార్గెట్లుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం హఠాత్తుగా యూనిఫాం నిబంధన అమల్లోకి తెచ్చి.. అవి ధరించని వారికి నోటీసులిచ్చి వేధిస్తోందని వాపోతున్నారు. ఉన్నత చదువులు చదివిన తమను రికార్డు అసిస్టెంట్ పోస్టుల్లో నియమించి.. బయోమెట్రిక్ హాజరు, ఓటీఎస్ అంటూ అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు
0 Response to " యూనిఫాం మాకు మాత్రమే ఎందుకు?"
Post a Comment