ఈహెచ్‌సీ సమస్యలపై 16న జేఎస్‌సీ

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ఈ నెల 16న ఉద్యోగుల హెల్త్‌ కార్డుల సమస్యలపై అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ (జేఎ్‌ససీ) సమావేశం జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే జేఎ్‌ససీలో ఉన్న ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం సమాచారం అందించింది.


 దీనికి సన్నాహక సమావేశంగా సోమవారం అమరావతి సచివాలయంలో సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, జేఎ్‌ససీలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. 


హెల్త్‌ కార్డులకు సంబంధించి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు. బుధవారం జరిగే సమావేశంలో సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను ఉద్యోగ సంఘాల నేతలను అడిగి తెలుసుకున్నారు. 


హెల్త్‌ కార్డులు అలంకారప్రాయంగా మారిన తీరును ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్య కార్యదర్శికి వివరించారు. ఎంపానెల్‌మెంట్‌ ఆసుపత్రులన్నింటిలో ఈ కార్డులు పని చేసేలా చూడాలని కోరారు. 


మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ సదుపాయాన్ని కూడా పొడిగించాలని కోరినట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఈహెచ్‌సీ సమస్యలపై 16న జేఎస్‌సీ"

Post a Comment