ఉద్యమంపై ఎస్మా?
ఎస్మా అంటే...
సమ్మెలు, హర్తాళ్ల వంటి సందర్భాల్లో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981లో రూపొందించిన చట్టమే ‘ఎస్మా’. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మె చేపడితే.. జన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంది. అత్యవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించిన ఏ సేవనైనా అత్యవసర సేవగా పరిగణించి, ఆయా సేవలకు సంబంధించి ‘ఎస్మా’ వర్తిస్తుందని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయవచ్చు. నీటి సరఫరా, ఆస్పత్రులు, పారిశుధ్యం, రవాణా, తంతి తపాలాలతో పాటు పెట్రోలు, బొగ్గు, విద్యుత్, ఉక్కు, ఎరువుల వంటి వనరుల ఉత్పత్తి-రవాణా పంపిణీ సేవలకు, బ్యాంకింగ్, ఆహార ధాన్యాల పంపిణీకి దీన్ని వర్తింపజేయవచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెను నిషేధిస్తున్నట్లు ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే ఇక ఆయా రంగాల్లో సేవలు అందించే ఉద్యోగులు సమ్మె చేయడం చట్టవిరుద్ధం అవుతుంది
0 Response to "ఉద్యమంపై ఎస్మా?"
Post a Comment