ఎస్‌బీఐ.. ఇదేం నిబంధన?




గర్భిణులను విధుల్లోకి తీసుకోవడంలో ఆంక్షలా?


3 నెలలు నిండిన గర్భిణులను తాతాల్కికంగా 

అనర్హులనడంపై విమర్శల వెల్లువ

స్టేట్‌ బ్యాంక్‌ వివాదాస్పద నిర్ణయం

ఢిల్లీ మహిళా కమిషన్‌ జోక్యంతో మరింత వేడి

వెనక్కు తగ్గిన బ్యాంకు.. రూల్‌ ఉపసంహరణ

న్యూఢిల్లీ, జనవరి 29: ఎస్‌బీఐ తీసుకున్న ఓ నిర్ణ యం వివాదాస్పదమైంది. గర్భం దాల్చి 3 నెలలు దాటిన మహిళలు తమ సంస్థలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులని ఎస్‌బీఐ పేర్కొనడం పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది. ఉద్యోగ అర్హత పరీక్ష రాసేందుకు అడ్డం రాని గర్భం.. విధుల్లోకి తీసుకునేందుకు ఎలా అవాంతరంగా మారిందని మహిళా లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మిక సంఘాలతోపాటు ఢిల్లీ మహిళా కమిషన్‌(డీసీడబ్ల్యూ) కూడా ఈ నిబంధనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మెట్టు దిగిన ఎస్‌బీఐ వివాదాస్పద నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. కొత్త రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించి అభ్యర్థి ఫిట్‌నెస్‌ ప్రమాణాలను 2021 డిసెంబర్‌లో ఎస్‌బీఐ సవరించింది. తమ సంస్థకు కొత్తగా ఎంపికైన వారిలో గర్భం దాల్చి 3 నెలలు దాటిన వారు అనర్హులని, ప్రసవం అయిన 4 నెలల లోపు ఎప్పుడైనా సరే ఉద్యోగంలో చేరవచ్చని తెలిపింది. ఇలాంటి నిబంధన ఎందుకు పెట్టారు, ఎవరు ఆమోదించారో చెప్పాలంటూ బ్యాంకుకు డీసీడబ్ల్యూ నోటీసు పంపింది. తక్షణమే నిబంధనను విత్‌ డ్రా చేసుకోవాలని కోరింది. దీంతో గర్భిణులకు పాత నిబంధనలనే అమలు చేస్తామని ఎస్‌బీఐ తెలిపింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎస్‌బీఐ.. ఇదేం నిబంధన?"

Post a Comment